హైకోర్టులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సహజంగా ఇంగ్లిషులోనే వాదనలు జరిగే హైకోర్టులో ఈ రోజు తెలుగులో వాదనలు వినిపించాయి. తెలుగులో వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది సోమరాజు చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ అంగీకరించారు.
భూ సేకరణ వివాదం కేసులో హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ న్యాయవాది సోమరాజు తెలుగులో వాదనలు వినిపించి ఇలా ఆకట్టుకున్నారు. తెలుగులో వాదనలు వినిపించిన సోమరాజుకు పలువురు అభినందించారు.
తెలుగు భాషకు పట్టం కడుతూ హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగులోనే వాదనలు జరగడం విశేషం..