Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగా పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. . అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Last Updated : Aug 22, 2020, 05:28 PM IST
Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

Pawan Kalyan wishes Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన చిత్రాలను పంచుకుని విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చిరంజీవికి ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహాన్ని నింపారు. చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగంతో జనసేన తరపున జనసేనాని పవన్ కల్యాణ్ ఓ లేఖ రాసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. Also read: Acharya: చిరంజీవి 152 చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల

Pawan Kalyan wishes Chiranjeevi birthaday

శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమని.. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన అన్నా వ‌దిన‌లను త‌న త‌ల్లిదండ్రులుగా భావిస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు.  ఆయ‌న క‌ష్ట‌ప‌డే తత్వం ప్ర‌తీ ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని, ఆయన తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని లేఖ‌లో పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని రాశారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన్ను తెలుగు ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుతూ.. అన్నయ్య ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

Trending News