Pawan Kalyan Fans: అయ్యప్పమాల.. హనుమాన్ మాల.. శివమాల ఇవి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప మాల ధరిస్తారు. శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకుంటారు. హనుమాన్ మాల ధరించిన వారు కొండగట్టుతో పాటు తమ సమీప ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన హనుమాన్ ఆలయాలకు వెళ్లి మాలను తీసివేస్తుంటారు. సింహాద్రి అప్పన్నమాల.. విజయవాడ దుర్గామాత మాల కూడే వేస్తూ కొందరు భక్తులు పూజలు చేస్తుంటారు. తాజాగా గోదావరి జిల్లాలో వెలుగుచూసిన ఓ అంశం చర్చగా మారింది, టాలీవుడ్ టాప్ హీరో, రాజకీయ నేత కోసం ఆయన అభిమానులు మాల ధరిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మేనియా గోదావరి జిల్లాల్లో మాములుగా ఉండదు. పవన్ పేరు చేబితే జనాలు ఊగిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొందరు యువకులు పవన్ మాల ధరించబోతున్నామని చెప్పారు. తమ అభిమాన నాయకుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ మాల ధరిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈసారి ఆయన జనసేన చీఫ్ 49వ వడిలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో తమ నేత 49వ పుట్టిన రోజు సందర్భంగా 49 రోజుల పాటు పవన్ మాల ధరిస్తామని ప్రకటించారు. పవన్ మాల పేరుతో ఎర్రచందనం మెడలో వేసుకుని దీక్ష చేపడతామని చెప్పారు. ఇలా పవన్ జన్మదినం రోజుల ఆయన అభిమానులు పవన్ మాల ధరించే సరికొత్త ట్రెండ్ ప్రారంభించారు.
పవన్ మాల ధరించి 49 రోజుల పాటు జనసేనాని ఆశయాలను జనంలోకి తీసుకువెళతామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఏదో ప్రచారం కోసం కాకుండా తాము పూర్తి చిత్తశుద్దితో దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాల స్పూర్తితో తాము కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జనసేనాని లక్ష్యాలను వివరించడంతో పాటు జనసేన పార్టీకి ప్రచారం చేస్తామని యువకులు ప్రకటించారు. పాలకొల్ల యువకుల పవన్ మాల ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. యువకుల తీరును కొందరు పిచ్చివాళ్లని చెబుతుంటే.. మరికొందరు మాత్రం తమ అభిమాన నేతపై ఇలా అభిమానం చూపిస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు దేవుళ్ళ కోసం భక్తితో వేసుకునే మాలను ఇలా ఒక నటుడి కోసం వేసుకోవడం దారుణమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రాజకీయాల్లో చాలా మంది నేతలుప్రజలకు సేవ చేశారని.. వాళ్లంతా జనాల దృష్టిలో గొప్ప లీడర్లుగా ముద్ర వేసుకున్నారు తప్ప దేవుళ్లు కాలేదని కొందరు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇలా మాల పేరుతో తమ అభిమానాన్ని హద్దులు దాటించారని విమర్శిస్తున్నారు.మొత్తంగా పాలకొల్లు యువకుల మాల ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం
Read Also: Munawar Faruqui: హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షోకు అనుమతి.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏం చేస్తారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook