మరోచారిత్రక ఘట్టం ; గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి సర్వం సిద్ధం

                    

Last Updated : Nov 27, 2018, 10:44 AM IST
మరోచారిత్రక ఘట్టం ; గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి సర్వం సిద్ధం

ఏపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చెందిన అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ రోజు గోవావరి - పెన్నా నదుల అనుసంధానికి సంబంధించిన ప్రాజెక్టుకు గుంటూరు జిలా నకరికల్లు వద్ద ఏపీ సీఎం  చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 

సుదీర్ఘకాలం పట్టే ఈ  ప్రాజెక్టు మొత్తం ఐదు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ ప్రాజెక్టు ఖర్చు మొత్తం 83 వేల 796 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలి దశ పనుల కోసం  6020 కోట్లతో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు  రాయలసీమ ప్రాంతంలో తాగు మరియు సాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు.

పెన్నా నది కర్నాటక నుంచి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు మరియు నెల్లూరు ప్రాంతంలో ప్రవహిస్తోంది. నెల్లూరు గుండా నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. దీంతో గోదావరి నదితో అనుసంధానం చేసి నీటిని ఉపయోగించాలని ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను  అనుసంధానం చేసిన ఏపీ సర్కార్ ..గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేసి మరో అడుగుముందుకు వేయాలని భావిస్తోంది. 

అమరావతిలో ఈ రోజు ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి-పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రోజు చరిత్ర సృష్టించబోతున్నామన్నారు.  రాష్ట్రంలో పంచ నదుల మహాసంగమం ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ కాన్షరెన్స్ లో  జిల్లా కలెక్టర్లు, అధికారులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Trending News