Pinnelli Anticipatory Bail: ఎమ్మెల్యే పిన్నెల్లి సంచలన నిర్ణయం.. అరెస్ట్‌ కాకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Petition In AP High Court: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్‌ కాకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 23, 2024, 05:15 PM IST
Pinnelli Anticipatory Bail: ఎమ్మెల్యే పిన్నెల్లి సంచలన నిర్ణయం.. అరెస్ట్‌ కాకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Pinnelli Ramakrishna Reddy: రణరంగాన్ని తలపించిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన కేసుల్లో ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భారీ ట్విస్ట్‌ ఇచ్చాడు. తనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టులో వేశారు. గురువారం మధ్యాహ్నం న్యాయస్థానంలో పిన్నెల్లి పిటిషన్‌ వేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. అయితే కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరిస్తుందా? స్వీకరించి విచారణ చేస్తుందా అనేది ఉత్కంఠ నెలకొంది.

Also Read: Macherla: పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

 

పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 202లో ఈనెల 13 పోలింగ్‌ జరిగింది. అయితే పోలింగ్‌ సమయంలో పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. ఈవీఎం మిషన్‌లను ఎత్తి పడేశారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశారు. అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ సాధారణ మహిళ నిలదీయగా ఆమెను కూడా ఎమ్మెల్యే దుర్భాషలాడాడు. పిన్నెల్లి సృష్టించిన అరాచకం వీడియోలను ప్రత్యేక దర్యాప్తు బృందం ఈసీకి పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక పోలీస్‌ యంత్రాంగం కేసు నమోదు చేసింది. అరెస్ట్‌ చేస్తారనే భయంతో రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి గురువారం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Also Read: Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. మళ్లీ హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు

 

కేసు నమోదైన పిన్నెల్లిని తెలంగాణలో అరెస్ట్‌ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అరెస్ట్‌ కాలేదని కోర్టులో వేసిన పిటిషన్‌తో తేలిపోయింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన లొంగిపోతారనే ప్రచారంతో కోర్టు చుట్టుపక్కలా పోలీస్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కోర్టు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పిన్నెల్లి వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News