Anantapuram: పెట్టెల కొద్దీ బంగారం, వెండి..మారణాయుధాలు

తీగలాగారంతే...డొంకంతా కదిలి వచ్చింది. మారణాయుధాలు  ( Weapons ) దాచిపెట్టాడనే సమాచారంతో సోదాలు జరిపితే అవాక్కయ్యా ఘటన వెలుగుచూసింది. ట్రెజరీ ఉద్యోగి ( Treasury employ corruption) అవినీతి భాగోతమంతా బట్టబయలైంది. ట్రంకు పెట్టెల సాక్షిగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు పోలీసులకు ఊహించిన మారణాయుధాలు లభించాయి.

Last Updated : Aug 19, 2020, 04:11 PM IST
Anantapuram: పెట్టెల కొద్దీ బంగారం, వెండి..మారణాయుధాలు

తీగలాగారంతే...డొంకంతా కదిలి వచ్చింది. మారణాయుధాలు  ( Weapons ) దాచిపెట్టాడనే సమాచారంతో సోదాలు జరిపితే అవాక్కయ్యా ఘటన వెలుగుచూసింది. ట్రెజరీ ఉద్యోగి ( Treasury employ corruption) అవినీతి భాగోతమంతా బట్టబయలైంది. ట్రంకు పెట్టెల సాక్షిగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు పోలీసులకు ఊహించిన మారణాయుధాలు లభించాయి. 

అనంతపురం జిల్లా ( Anantapuram district ) బుక్కరాయసముద్రంలోని బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో పెట్టెల కొద్దీ బంగారం, వెండి, మారణాయుధాలు వెలుగుచూడటంతో అంతా అవాక్కయ్యారు. నిర్ఘాంతపోయారు. వాస్తవానికి ఆ ఇంట్లో మారణాయుధాలు దాచిపెట్టారని పోలీసులకు సమాచారం లభించింది. దాంతో సోదాలు జరపగా...ఏకంగా 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన రెండున్నర కిలోల బంగారం ( 2.5 kilograms gold ), 84 కిలోల వెండి ( 84 kilograms silver ) , 15 లక్షల నగదు, 49 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 27 లక్షల ప్రామిసరీ నోట్లు, 3 9 ఎంఎం పిస్టళ్లు, 18 బ్లాంక్ రౌండ్లు, , 1 ఎయిర్ గన్, హార్లీ డేవిడ్ సన్ మోటార్ బైక్, 2 మహీంద్రా కార్లు, 3 ఎన్ఫీల్డ్ బైక్ లు, 2 కరిజ్మా మోటార్ సైకిళ్లు,  4 ట్రాక్టర్లు….జాబితా విని ఆశ్చర్యపోతున్నారా...నిజమే..ఇవన్నీ బయటపడ్డాయి. అయితే ఇవన్నీి బాలప్పవి కావు. అనంతపురం జిల్లా ట్రెజరీలో సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ విగా పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడకుండా ఉండేందుకు తన డ్రైవర్ బంధువైన బాలప్ప ఇంట్లో ఇవన్నీ దాచిపెట్టాడు.  

ఇప్పుడీ సొమ్ము నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలో దిగనుంది. మారణాయుధాల కేసులో పోలీసులు ఎలాగూ విచారణ కొనసాగిస్తున్నారు. ఒక్క బంగారం విలువే 3.5 కోట్లుగా తెలుస్తోంది. 

Trending News