YS Sunitha Reddy Political Entry Posters: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అవుతుండగా.. ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో విచారణ పూర్తి చేయడానికి సీబీఐకి జూన్ 30వ తేదీ వరకు గడవు పొడగించిన విషయం తెలిసిందే. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకపోతే.. అరెస్ట్ ఖాయమని ఇప్పటికే సీబీఐ సంకేతాలు ఇచ్చిన తరుణంలో వైసీపీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. భవిష్యత్ కార్యచరణపై ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో చర్చిస్తున్నారు.
ఈ కేసుపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలోనే వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ సునీతమ్మకు స్వాగతం అంటూ టీడీపీ నాయకులతో ఉన్న పోస్టర్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిశాయి. ఈ పోస్టర్లు ప్రొద్దుటూరు ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లలో సునీతతోపాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డి, వైఎస్ వివేకా ఫోటో కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్లపై భారీగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టర్లు బెంగుళూరులో ముద్రించినట్లు తెలుస్తోంది.
Also Read: Nellore Politics: సీఎం జగన్ ఫొటో రచ్చ.. నా చీర లాగారంటూ మహిళా మేయర్ ఆవేదన
అధికార వైసీపీపై గతకొంత కాలంగా వైఎస్ సునీతారెడ్డి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వివేకా హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారని ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అన్నారు. ఈ నేపథ్యంలో సునీతారెడ్డి పోస్టర్లు అంటించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా..? లేదా..? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్ష్‌గానే ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరూ ఈ పోస్టర్లపై స్పందించడం లేదు. ఎవరు అంటించారనే విషయం మిస్టరీగా మారింది.
Also Read: YS Sharmila News Updates: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు.. కండీషన్స్ అప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook