AP DSC Notification: ప్రజాక్షేత్రంలోనే కాదు సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం వేసిన డీఎస్సీ ఉద్యోగ ప్రకటనపై షర్మిల ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 'దగా డీఎస్సీ'గా పేర్కొంటూ డీఎస్సీపై తొమ్మిది ప్రశ్నలు లేవనెత్తారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదని చేతనైతే తాను లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ మేరకు 'ఎక్స్'లో ప్రశ్నలు సంధించారు.
Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు
'నానపై వ్యక్తిగత విమర్శలు కాకుండా..నేను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' అని షర్మిల కోరారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేశాడని గుర్తు చేశారు. ఆయన వారసుడిగా చెప్పుకొనే జగనన్న కేవలం 6 వేల పోస్టులతో డీఎస్సీ వేసి నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. ఈ విషయమై ప్రశ్నిస్తుంటే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వైసీపీ నాయకులు, వాళ్లను వెనకేసుకొచ్చే వారి సోషల్ మీడియాకు ఆమె 9 ప్రశ్నలు సంధించారు.
Also Read: YS Sharmila: రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కొన్ని నిమిషాలు రహాస్య మంతనాలు?
షర్మిల ప్రశ్నలు ఇవే..
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?
2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?
3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?
4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధా..?
6. వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా?
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా?
8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా?
9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?
నవరత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook