Anantapuram Road Accident: అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పామిడి(Pamidi)లోని 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో(Auto)లో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా... మరో 9 మంది గాయపడ్డారు. వీరంతా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి కోతకు వెళ్తుండగా దుర్ఘటన(Road Accident) చోటుచేసుకుంది.
ఇద్దరి పరిస్థితి విషమం
మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను సుబ్బమ్మ, శంకరమ్మ, నాగవేణి, సావిత్రి, చౌడమ్మగా గుర్తించారు. వీరిది గార్లదిన్నె మండలం కొప్పలగొండ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Gold Smuggling News: విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో రూ.1.91 కోట్ల విలువైన అక్రమబంగారం పట్టివేత
కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి
ఇదే జిల్లా(Anantapuram District)లో మరో ప్రమాదం కూడా చోటుచేసుకుంది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై పాదచారులను కారు(Car Accident) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పామిడి మండలం ఎదురూరు వాసులు యాకుబ్ (62), నారాయణ (60)గా గుర్తించారు.
గవర్నర్, చంద్రబాబు సంతాపం
ఈ ఘటన పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(AP Governor Bishwabhushan Harichandan), తెదేపా అధినేత చంద్రబాబు(Chandra babu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook