Sankranti Pandem Kollu Varieties, Do You Know How Many Types of Betting Chickens: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగలలో 'సంక్రాంతి' ఒకటి. సంక్రాంతి వచ్చిందంటే ముఖ్యంగా కోస్తాంద్ర సందడి సందడిగా మారుతుంది. కొత్త అల్లుళ్లు, కోడి పందాలతో కోలాహాలంగా మారుతుంది. చాలా కాలం నుంచి 'కోడి పందాలు' సంప్రదాయంగా వస్తూ ఉండడంతో.. చాలా మంది కోడి పందాలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కోడి పందాలలో కొంతమందికి డబ్బు రూపంలో అదృష్టం కలిసొస్తే.. మరికొందరికి దురదృష్టం వెంటాడుతుంది. సంక్రాంతి సమయంలో లక్ష్యలో డబ్బు చేతులు మారుతుంది. కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించినా.. ఆపై సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అనుమతించింది.
కోడి పందాల కోసం కొంత మంది ఎంతో ఖర్చుపెట్టి కోళ్లను పెంచుతుంటారు. కోళ్ల కోసం బాదాం, పిస్తా, జీడిపప్పు, కాజు, మటన్ కీమా లాంటి ఖరీదైన వస్తువులు పెడతారు. అంతేకాదు కోడిను ప్రత్యేకంగా చూసుకుంటారు. ఓ కోడి కోసం వేయిలల్లో ఖర్చు చేయడానికి ఒకే కారణం.. కోడి పందాల గెలుపు ఒటములను పరువు-ప్రతిష్టగా భావించడమే. అయితే ఈ పందాలలో పాల్గొనే కోళ్లు ఎన్నో రకాలు ఉంటాయి. కోళ్ల రకాలను బట్టి, వాటి రంగులను బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పందెం కోళ్ల రకాలు:
డేగ: ఈ కోడి పుంజుకి ఎర్రటి ఈకలు ఉంటాయి
పచ్చకాకి: ఈ కోడి పుంజుకు ఆకుపచ్చ, నలుపు ఈకలు ఉంటాయి
కాకి: ఈ కోడి పుంజుకు నల్లటి ఈకలు ఉంటాయి
నెమలి: ఈ కోడి పుంజుకు పసుపు ఈకలు ఉంటాయి
కౌజు: ఈ కోడి పుంజుకు నలుపు, ఎరుపు, పసుపు ఈకలు ఉంటాయి
సవల: ఈ కోడి మెడపై నల్లటి ఈకలు ఉంటాయి
పింగళి: ఈ కోడి పుంజుకు తెలుపు రెక్కలపై నలుపు, గోదుమ రంగు ఈకలు ఉంటాయి
మైల: ఈ కోడి పుంజుకు ఎరుపు, బూడిద రంగు ఈకలు
పర్ల: ఈ కోడి పుంజు మెడ పై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటాయి
కొక్కరాయి: ఈ కోడి పుంజు నల్లటి శరీరం 2,3 ఇతర రంగులు ఉంటాయి
పూల: ఈ కోడి పుంజు ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉంటాయి
ముంగిస: ఈ కోడి పుంజుకి ముంగిస జూలు రంగు ఈకలు ఉంటాయి
అబ్రాసు: ఈ కోడి పుంజుకి లేత బంగారు రంగు ఈకలు ఉంటాయి
గేరువా: ఈ కోడి పుంజుకి తెలుపు, లేత ఎరుపు ఈకలు ఉంటాయి
ఇక ఇవే కాకుండా ఇంకా చాలా రకాల పందెం కోళ్లు ఉన్నాయి. కోడి నెమలి, పచ్చ కాకి, కాకి నెమలి, తెలుపు గౌడు (నలుపు, తెలుపు ఈకలు గల కోడిపుంజు), నల్ల సవల (రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు), ఎరుపు గౌడు (నలుపు, ఎరుపు ఈకలు గల కోడిపుంజు), నల్ల మచ్చల సేతు (తెల్లని ఈకల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు)లు కూడా ఉంటాయి. వీటిలో కొన్నింటి ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు కూడా ఉంటుంది.
Also Read: Rahu Transit 2023: మేష రాశిలోకి రాహువు.. ఈ 4 రాశుల వారికి అపారమైన డబ్బు సొంతం! అస్సలు ఊహించరు
Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.