Byreddy Siddharth Reddy: కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు తెలియని వారుండరు. అతి కొద్దికాలంలో ఫేమస్ లీడర్‌గా మారారు. సోషల్ మీడియాలో తన మాటలతో యూత్‌కు బాగా దగ్గరయ్యారు. ఆయన స్పీచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. వైసీపీలోనే కీలక నేతగా ఎదిగారు. అయితే ఇటీవల పార్టీలోని సీనియర్ నేతల విభేదాలతో కాస్త సెలెంట్ అయ్యారు.
గత ఎన్నికలకు ముందు ఎవరెన్ని అన్న తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్లారు సిద్దార్థరెడ్డి. పార్టీ అధినేత అడుగు జాడలో నడిచారు. పార్టీ అధికారంలోకి రాగానే ఈ యంగ్ లీడర్ కష్టాన్ని గుర్తించింది. శాప్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి తళుక్కున మెరిశారు. తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. పార్టీలో మంచి స్పోక్ పర్సన్‌గా మారారు. ఇప్పుడు సీనియర్ నేతల దృష్టి అంతా ఆయనపైనే పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బైరెడ్డితో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో వైసీపీలో సరికొత్త ట్రెండ్ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. దీంతో వైసీపీ ప్రభుత్వం గడపగడపకు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో బైరెడ్డి స్పీచ్ హైలెట్‌గా ఉంటుందని.. ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి యువ నాయకుడి గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆయనకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు సీనియర్ నేతలు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బైరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Shirdi Bus Accident: షిరిడీ యాత్రకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి