వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఒకవైపు పవన్ అభిమానినని ప్రకటించుకుంటూనే మరోవైపు ఆయనకు చురకలు అంటిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ అభిమానుల ఆందోళన గురించి స్పందిస్తూ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు అని ఉచిత సలహా ఇచ్చింది.
జనసేన కార్యకర్తలు తనపై చేస్తున్న కామెంట్స్ గురించి స్పందిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి.. ప్రజల సమస్యల కోసం పోరాడుతూ.. నలుగురికి మార్గదర్శకం అవ్వాలి అంతేకానీ సహనం లేకుండా కార్లు పగలగొట్టడం సరికాదని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడింది.
ఫాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి వుండి, ప్రజల సమస్యలకోసం పోరాడుతూ నలుగురికి మార్గదర్శం అవ్వాలి అంతేగాని సహనం లేకుండా కార్ లు పగలకొట్టడం కాదు, ఫాన్స్ పవన్ కళ్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు #srireddy
— Sri Reddy (@MsSriReddy) April 21, 2018
అలాగే ఫిల్మ్ ఛాంబర్‌కు అల్లు అర్జున్, రామ్ చరణ్ రాకపై స్పందిస్తూ మెగా ఫ్యామిలీ ఇలా ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హూందాగా ఉండేదని శ్రీరెడ్డి పేర్కొంది.
ఈ రోజు స్పందించినట్లు మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హుందాగా ఉండేది, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ కి నేను వీరాభిమానిని 😍😍😘#MegaFamily pic.twitter.com/Zp8DwpvV80
— Sri Reddy (@MsSriReddy) April 20, 2018
ఇదిలా ఉండగా శ్రీరెడ్డి, వర్మల వ్యవహారం తేల్చాలని మూవీ అర్ట్స్ అసోషియేషన్ కు పవన్ శుక్రవారం అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి 24 గంటల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు అగ్గికి అజ్యం పోలినట్లుగా ఉందని..ఈ కామెంట్స్ మరింత వివాదానికి దారితీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.