వేళ్లూనుకుంటున్న కన్నడిగ ఉద్యమం

కన్నడిగ ఉద్యమం మళ్లీ వేళ్లూనుకుంటోంది. గతంలో హిందీకి వ్యతిరేకంగా పోరాడిన కన్నడిగులు మళ్లీ రిజర్వేషన్ల కోసం పోరాట బాట పట్టారు. ఇందులో భాగంగా అన్ని కన్నడిగ గ్రూపులు ఒక్కటయ్యాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి.

Last Updated : Feb 13, 2020, 12:18 PM IST
వేళ్లూనుకుంటున్న కన్నడిగ ఉద్యమం

కన్నడిగ ఉద్యమం మళ్లీ వేళ్లూనుకుంటోంది. గతంలో హిందీకి వ్యతిరేకంగా పోరాడిన కన్నడిగులు మళ్లీ రిజర్వేషన్ల కోసం పోరాట బాట పట్టారు. ఇందులో భాగంగా అన్ని కన్నడిగ గ్రూపులు ఒక్కటయ్యాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి.

కన్నడ గ్రూపులు ఈ రోజు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కర్ణాటక అంతటా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా కన్నడిగులు ఆందోళన నిర్వహించారు. కర్ణాటకలో సరోజినీ మహిషి ఇచ్చిన నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో తొలుత కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని .. వారికే రిజర్వేషన్లు కల్పించాలనేది కన్నడిగుల ప్రధాన డిమాండ్. ఇదే అంశాన్ని గతంలో సరోజినీ మహిషి ఇచ్చిన నివేదిక వెల్లడించింది. ఇప్పుడు దాన్ని అమలు చేయాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Andhra Pradesh tourism stone pelted while kannadiga protest in Mangalore.

A post shared by Ramesh (@ra.mesh2454) on

కర్ణాటక బంద్ సందర్భంగా కన్నడిగుల ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులను కన్నడిగ ఉద్యమకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న బస్సుపై కన్నడ ఉద్యమకారులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఐతే ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. 

మరోవైపు కన్నడ ఉద్యమకారులు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యెడ్యూరప్పను కలిశారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో కన్నడిగులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

Trending News