ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న చ‌ట్టం: 'మూడు నెలల్లో ఏపీలో హైకోర్టు సిద్ధం'

'మూడు నెలల్లో ఏపీలో హైకోర్టు సిద్ధం'

Last Updated : Oct 1, 2018, 02:30 PM IST
ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న చ‌ట్టం: 'మూడు నెలల్లో ఏపీలో హైకోర్టు సిద్ధం'

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. హైకోర్టు ఎప్పుడు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి ఏపీలో హైకోర్టు సిద్ధమవుతుందని సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నారీమన్ తెలిపారు.

అయితే ఏపీ గత మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. హైకోర్టు భవనం ఎప్పటిలోగా సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో కోర్టుకు ఇవ్వాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని కోసం రెండు వారాల గడువునిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు.. ఇదే విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడున్న భవనంలో కానీ, హైదరాబాద్ నగరంలో వేరే భవనాలలో గానీ ప్రత్యేక కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్రం పిటిషన్ వేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కేంద్రం పిటిషన్‌లో కోరింది.

Trending News