TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..

TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 7, 2024, 12:39 PM IST
TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..

TDP: 2014లో విభిజిత ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అటు జగన్ ప్రతిపక్ష నేత అయ్యారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో విభేదించడం మూలానా భారీ మూల్యం చెల్లించుకున్నారు. అంతేకాదు ఏపీలో జగన్ ఎన్నడు లేనట్టుగా 151 సీట్లతో అధికారంలో వచ్చారు. అటు టీడీపీ 23 సీట్లకే పరిమితం అయింది. మరోవైపు తక్కువ అసెంబ్లీ సీట్ల కారణంగా గత ఐదేళ్లలో ఒక్క రాజ్యసభ సీటు దక్కించుకోలేపోయింది. దీంతో రాజ్యసభలో తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలుగు దేశం పార్టీ ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాజ్యసభలో ఒకటో రెండో సీట్లు గెలుచుకుంటూ వచ్చేది. కానీ 2024 ఎన్నికల నాటికీ ఆ పార్టీకి పెద్దల సభలో సభ్యుడన్న వాడే లేకుండా పోయాడు.

కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ దాదాపు 11 సీట్లకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం మొత్తం 175 సీట్లలో 164 సీట్లను గెలచుకొని సంచలనం రేపింది. ఏపీలో గెలిచిన తర్వాత తెలుగు దేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా వైసీపీకి రాజ్యసభలో ఉన్న మెంబర్స్ కు గాలం వేసింది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఇద్దరు వైసీపీ నేతలు మోపీదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు  రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి  రాజీనామా చేశారు.త్వరలో వీళ్లిద్దరు తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

మరోవైపు బీసీ నేత కృష్ణయ్య.. రాజ్యసభతో పాటు వైసీపీకి టాటా చెప్పేసారు. దీంతో రాజ్యసభలో ఏపీ నుంచి కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభకు పంపే అవకాశం వచ్చిందనే చెప్పాలి. మొత్తంగా రాజ్యసభ వేదికగా జగన్ కు చంద్రబాబు చావు దెబ్బ కొట్టాడనే చెప్పాలి. మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంలో అటు చంద్రబాబుతో పాటు సనాతన ధర్మ పరిరక్షణతో పాటు తన కూతురు క్రిష్టియన్ అంటూ  తిరుమల దర్శనం వేదికగా డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.  ఓ రకంగా ఈ డిక్టరేషన్ పై సంతకంతో మెజారిటీ ప్రజల్లో జగన్ తీరును ఎండ గట్టి  చావు దెబ్బ తీసాడు పవన్ కళ్యాణ్. మొత్తంగా జగన్ కు ఓ వైపు చంద్రబాబు.. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ తీస్తున్నారు. మరి దీని నుంచి జగన్ ఎలా బయట పడతాడనేది చూడాలి.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News