Yanamala on CM Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎందు కోసం టూర్ అని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ..సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ విదేశీ టూర్ దేని కోసమన్నారు. దండుకున్న అవినీతి సంపద దాచుకోవడానికేనా అని ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా..లేక వ్యక్తిగతం కోసమా అన్న అనుమానాలు కల్గుతున్నాయని..వీటిని నివృత్తి చేయాలన్నారు.
దండుకున్న సంపద దాచుకోవడానికే విదేశాలకు వెళ్లాలన్న భావన ప్రజల్లో ఉందన్నారు. అధికారికంగానే ఏ సీఎం అయిన విదేశాలకు వెళ్లొచ్చని..కానీ చాటుమాటునా పోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అధికారులను వదిలేసి కేవలం ముగ్గురు మాత్రమే లండన్ వెళ్లారని యనమల రామకృష్ణుడు చెప్పారు. సొంత పనుల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ దేశ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి పొందారని..దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
14 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఏ-1 నిందితుడు జగన్ అని మండిపడ్డారు. ఆయన చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ సీఎంకు రాలేదని..ఇది ఏపీకి అప్రదిష్ట కాదా అని ప్రశ్నించారు. ఈ టూర్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాదని..దోపిడీ సొమ్ము దాచుకునేందుకేనని ఫైర్ అయ్యారు. దావోస్‌కు అందరూ కలిసి వెళ్లకుండా సీఎం ప్రత్యేకంగా వెళ్లడం వెనుక మర్మం ఏంటన్నారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై వైసీపీ ప్రభుత్వం అదనపు భారం మోపుతోందన్నారు. విలువైన ప్రజాధనాన్ని దున్వినియోగం చేస్తున్నారని..ఆ హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం జగన్(CM JAGAN) మూడేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీ పాలనలో దాడులు,దౌర్జన్యాలు తప్ప ఇంకేమి లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజలను దగా చేశారన్నారు. రాష్ట్రం మరో శ్రీలంకలా మారే పరిస్థితి ఉందన్నారు. జగన్ విదేశీ టూర్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also read: Instagram Reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని ఈ అమ్మాయి చాలా సులభంగా చేసేసింది!
Also read:Hyderabad Honour Killing: నీరజ్ హంతకులను ఉరి తీయాలని ఆందోళన.. బేగంబజార్ లో ఉద్రిక్తత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook