బోటు ముంపు: మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

బోటు ముంపు: మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

Last Updated : Sep 15, 2019, 11:00 PM IST
బోటు ముంపు: మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: పాపికొండల వద్ద పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ముంపునకు గురైన దుర్ఘటనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో ఆపదలో చిక్కుకున్న వారిలో 21 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నందున.. ఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ జారీచేసిన ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన కాకినాడకు వెళ్లారు.

ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, 08 ఐఆర్ బోట్లు, 12 అస్కా లైట్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెలికి తీసిన 8 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.

Trending News