తనిఖీ చేస్తున్న పోలీసులపై కాల్పుల కలకలం.. చివరికి!

చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఏకంగా కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ నిందితుడు పట్టుబడగా, మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.

Last Updated : Jun 2, 2020, 07:41 AM IST
తనిఖీ చేస్తున్న పోలీసులపై కాల్పుల కలకలం.. చివరికి!

లాక్‌డౌన్‌ (LockDown 5.0) నియమాలు  పాటించాలని సూచించిన పోలీసులపైనే కొందరు దుండగులు కాల్పుల (Gun Fire)కు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఓ దుండగుడు గాయాలతో పట్టుబడగా, ఇద్దరు దుండుగులు పరాయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టా్ర్‌ 24లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న బంగారం ధరలు

నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్‌ రన్‌విజయ్‌ సింగ్‌ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడ అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ రూల్స్‌ ప్రకారం  ద్విచక్రవాహనంపై కేవలం ఒక వ్యక్తి ప్రయాణించాలి. కానీ నోయిడా సెక్టార్‌ 24లో స్పైస్‌ మాల్‌ సమీపంలో ఓ స్కూటీపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తున్నారని పోలీసులు వారిని ఆపే యత్నం చేశారు.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

ఇంతలో స్కూటీపై ఉన్న ఓ దుండగుడు పోలీసులపై కాల్పులకు (Gun Fire On Police) తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా గాయపడ్డ పాత నేరస్తుడు మోను పట్టుబట్టాడు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారయ్యారు. మోను వద్ద నుంచి ఓ నాటు తుపాకీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మోను మీద ఇదివరకే 12 కేసులుండగా, రూ.25,000 రివార్డు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News