Tirumala Hundi Collection: కరోనా టైమ్‌లోనూ శ్రీవారి హుండీకి భారీ ఆదాయం

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజు భారీగా ఆదాయం సమకూరింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు వచ్చిందని టీటీడీ (Tirumala Tirupati Devasthanam) అధికారులు వెల్లడించారు.

Last Updated : Oct 2, 2020, 11:41 AM IST
Tirumala Hundi Collection: కరోనా టైమ్‌లోనూ శ్రీవారి హుండీకి భారీ ఆదాయం

చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజు భారీగా ఆదాయం సమకూరింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు వచ్చిందని టీటీడీ (Tirumala Tirupati Devasthanam) అధికారులు వెల్లడించారు.  మొత్తం 16,735 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 5,728 మంది భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో పాటు తలనీలాలు సమర్పించుకున్నారు.

మరోవైపు అక్టోబర్ 16వ నుంచి 24వ తేదీ వరకు విజయదశమి సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మాడవీధుల్లో యథావిధిగా వాహన సేవల ఊరేగింపు నిర్వహిస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహన సేవ జరిగే మాడవీధుల్లోని గ్యాలరీలలో థర్మల్‌ స్క్రీనింగ్‌, ఆపరేటెడ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు కళ్యాణవేదిక దగ్గర పుష్ప ప్రదర్శన, ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల దర్శనాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవ రోజుల్లో దర్శనాల సంఖ్యను 20వేల వరకు పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేవలం దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే నవరాత్రులు సందర్భంగా తిరుమలకు అనుమతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.  Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News