Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్

Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. లడ్డూ వ్యవహారంపై ఏపీలో అందరూ స్పందిస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2024, 07:16 PM IST
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్

Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త వెలుగు చూడగానే దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికివారు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు హఠాత్తుగా చేసిన కామెంట్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. 

తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ విషయమై నెలకొన్న వివాదంలో వాస్తవాలు ఎలా ఉన్నా ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. దేశంలోని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా లేదా మీడియాతో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయపై మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరికొకరు వ్యంగ్యాస్థ్రాలు సంధించుకుంటున్నారు. ఈ తరుణంలో మోహన్ బాబు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ పోస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎక్కడ లేని అభిమానాన్ని కురిపించినట్టు అర్ధమౌతోంది. చంద్రబాబును మిత్రుడిగా, ఆత్మీయుడిగా అబివర్ణించడమే కాకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పడం చర్చనీయాంశమౌతోంది.

మోహన్ బాబు చేసిన పోస్ట్ ఏంటంటే

ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామికి నిత్యం సమర్పించే లడ్డూలో వాడే ఆవు నెయ్యిలో మూడు నెలల క్రితం వరకూ జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లినట్టు మోహన్ బాబు తెలిపారు. తన యూనివర్సిటీ నుంచి నిత్యం తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది విద్యార్ధులు, వందలాది ఉపాధ్యాయులు భక్తి పూర్వకంగా పూజిస్తుంటామని, అలాంటి స్వామికి ఇలా జరగడం ఘోరం, నేరం, పాపం, హేయం, నికృష్ఠం, అతి నీచం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే నేరస్థుల్ని కఠినంగా శిక్షించాలని తన ఆత్మీయుడు, మిత్రుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుకుంటున్నానని చెప్పారు. కలియగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకుని చంద్రబాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని తెలిపారు. మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Also read: Tirumala Laddu Dispute: టాలీవుడ్‌లో కాక రేపుతున్న లడ్డూ వివాదం, మంచు విష్ణుకు ఇచ్చి పడేసిన ప్రకాశ్ రాజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News