టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీడీడీపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి చెందిన అమూల్యమైన సంపద అన్నపోటు వద్ద ఉందని బ్రిటీష్ శాసనంలో ఉందని.. అందుకే అక్కడ నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపారని దీక్షితులు ఆరోపించారు. టీటీడీలోని అక్రమాలను బయటపెట్టినందుకే తనను పదవి నుంచి తొలగించారని విమర్శించారు. అర్చకుల పట్ల టీడీటీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని... అక్రమాలను ప్రశ్నించవారికి తొక్కేస్తుందని ఆరోపించారు.
ఘోరంగా అవమానించారు..
ఆలయానికి వీఐపీలు వచ్చినప్పుడు డాలర్ శేషాద్రినే ప్రధాన అర్చకుడిగా పరిచయం చేసేవారని.. తనను కనీసం ఓ అర్చకుడిగా కూడా పరిచయం చేసేవారు కాదని రమణ దీక్షితులు మండిపడ్డారు. దీనికి తోడు వంశపారంపర్యంగా ఉన్న తన ఇంటిని కూడా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కాలంలో తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని రమణ దీక్షితులు ఆరోపించారు.
సీబీఐ విచారణకు సిద్ధం..
టీటీడీ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని..తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసిన వారు కూడా దీనికి సిద్ధమేనా? అంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సవాల్ విసిరారు.