Tirumala Mahashanti Homam:తిరుమల ఆలయంలో మహా శాంతి హోమం.. ప్రత్యేకతలు ఇవే..

Tirumala Mahashanti Homam: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. ఈ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పద్దార్ధాలు కలిపారంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. తాజాగా తిరుమలలో జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చితానికి మహా శాంతి హోమం నిర్వహిస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 24, 2024, 05:35 AM IST
Tirumala Mahashanti Homam:తిరుమల ఆలయంలో మహా శాంతి హోమం.. ప్రత్యేకతలు ఇవే..

Tirumala Mahashanti Homam: కోట్లాది హిందూ భక్తుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి  ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త ఎంతో భక్తుల మనోభావాలు దెబ్బ తీసాయి. మరోవైపు ఇదంతా కూటమిలోని ప్రభుత్వం తమ ప్రభుత్వ వైఫల్యాలు.. ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలు అమలు చేయకపోవడంతో పాటు వరదల నేపథ్యంలో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంలో వైఫల్యాల నుంచి తప్పు కప్పిపుచ్చుకోవడానికే తిరుమలలో అపచారం జరిగిందనే వాదనను ప్రతిపక్ష వైసీపీ వాదిస్తోంది. ఏది ఏమైనా తిరుమలలో జరిగిన ఈ అపచారంపై కోట్లాడి భక్తులు మనో వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం జరుగుతుంది.

శ్రీవారి లడ్డు ప్రసాదం వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యం ఈ మహా శాంతి యాగాన్ని తలపెట్టారు. బంగారు భావి పక్కన మూడు హోమ గుండాలు ఏర్పాటుచేసి యాగం చేస్తున్నారు. మహాశాంతి యాగం పూర్తి అయిన తర్వాత ఆ జలాలను ఆలయం, పోటును ప్రోక్షణ చేసి సంపూర్ణం చేస్తారు.

ఆగమ, వైఖానస శాస్త్రం ప్రకారం తెలిసి తెలియక ఎలాంటి తప్పు, అపచారాలు జరిగినప్పుడు పవిత్రోత్సవాలు చేసి పరిహారం చేస్తారు. కానీ గత నెల ఆగస్టు 15 న మూడు రోజుల పాటు చేశారు కాబట్టి ఆ దోషం పోయిందనీ.. పరిహారం అయింది అని.. అయితే భక్తులు ఆందోళన చెందకుండా ఉండేందుకే మహా శాంతి యాగం తలపెట్టినట్లు తిరుమల తిరుపతి దేవ స్థానం చెబుతుంది. ఈ మహా యాగంలో ప్రధాన అర్చకులతో పాటు ఆరుగురు అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x