AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఐఎండీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వచ్చే రెండు రోజుల్లో ఇది మరింతగా బలపడనుంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడి నెల్లూరు సమీపానికి చేరనుంది. అక్కడ్నించి తమిళనాడు దిశగా పయనించి ఆ రాష్ట్రంలోనే తీరం దాటవచ్చని అంచనా. ఈ ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక విజయనగరం, ప్రకాశం, కృష్ణా, బాపట్ల , పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక ఈనెల 19 అంటే రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్నందున ఈ నెల 22 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడవచ్చు.
వాతావరంలో చోటుచేసుకున్న మార్పులతో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో కెరటాలు ఎగసిపడుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చలి గాలుల కారణంగా బయట తిరగలేని పరిస్థితి.
Also read: Heavy Rains: తీరం దాటనున్న అల్పపీడనం.. ఈ 3 జిల్లాలకు అతి భారీ వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.