Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..

Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 11, 2024, 03:31 PM IST
  • కొత్త ఏడాదిపై కోటి ఆశలతో ఉన్న సామ్..
  • రెండో పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ..
Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..

Samantha latest post goes viral: సమంత  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంటారు. ఎప్పటి కప్పుడు తన ఇన్ స్టాలో పోస్టులు పెడుతు తన అభిమానులకు తన గురించి అప్ డేట్ లు ఇస్తుంటారు. కొన్నిసార్లు సామ్.. తన సినిమాలు, వెబ్ సిరిస్ ల గురించి పోస్టులు పెడుతుంటారు. మరికొన్ని సార్లు మాత్రం ఏదో అంశంగా మీద మాత్రం కాంట్ర వర్సీ అయ్యే విధంగా ఇటీవల పోస్టులు పెడుతున్నారు.

అయితే.. సామ్ .. చైతు, శోభితల ఎంగెజ్ మెంట్ నుంచి పెడుతున్న పోస్టులు ఎక్కువగా ఇన్ డైరెక్ట్ గా మాజీ భర్త చైతును ఉద్దేశించి పెడుతున్నవేనని తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత.. ఇటీవల చైతు తన ఎక్స్ మీద పెట్టిన డబ్బులు వెస్ట్ అయ్యాయని పోస్టులు పెట్టింది.

ఆ తర్వాత..మళ్లీ..ఇటీవల తన పెంపుడు శునకం ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా సాటిరాదని కూడా పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా, సమంత పెట్టిన పోస్టు మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు. 

ముఖ్యంగా సమంత.. చైతు పెళ్లి తర్వాత మాత్రం తన ఫ్యూచర్ గురించి కాస్తంతా ఆందోళనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఈ ఏడాది అచ్చిరాలేదని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తొంది. మాజీ భర్త ఇంట పెళ్లి బాజాలు, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇలా సామ్.. చాలా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తొంది.

అయితే.. వచ్చే కొత్త ఏడాది అంటే. 2025 లో కొన్ని రాశులకు అద్భుతంగా ఉండబోతుందని కొంత మంది జ్యోతిష్యులు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా వృషభం, కన్య, మకరం రాశులకు అన్ని శుభయోగాలు కల్గబోతున్నాయంట. దీన్ని సామ్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కొంత మంది ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ మూడు రాశులకు అన్ని శుభవార్తలు అంటున్నారు. అయితే.. సామ్ ది.. వృషభ రాశి అంట.

అదే విధంగా వచ్చే ఏడాదిలో తనకు మంచి ప్రేమను అందించే భాగస్వామిని పొందుతానని, వైవాహిక జీవితం, పిల్లలతో తదుపలి లైఫ్ సూపర్ గా ఉంటుందని కూడా సామ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీన్ని బట్టి సామ్.. కొత్త ఏడాదిలో రెండో పెళ్లి చేసుకొవడానికి రెడీఅయిపోయినట్లు తెలుస్తొంది.

Read more: Sobhita Dhulipala Dance: అరే వా.. సూపర్.. పెళ్లిలో కిర్రాక్ స్టెప్పులు వేసిన శోభిత ధూళిపాళ.. వీడియో ఇదిగో..

ఈ పోస్ట్ తో సామ్ అందరికి ముఖ్యంగా సామ్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఆమె అభిమానులు మాత్రం.. ఫుల్ పండగ చేసుకుంటున్నారంట. అంతే కాకుండా.. సామ్ ను చక్కగా చూసుకునే వాడు.. భర్తగా దొరకలనికూడా విష్ చేస్తున్నారంట. ప్రస్తుతం సామ్ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News