Teachers mlc Elections results: ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉభయగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వెలువడింది. కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది.
ఏపీలో మార్చ్ 14 వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు (Teachers mlc election) జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కాకినాడలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరుగుతుండగా..కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కళాశాలలో జరుగుతోంది. కౌంటింగ్ నిమిత్తం 14 టేబుళ్లు ఏర్పాటయ్యాయి.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తేలిపోవడంతో ఫలితాలు వెల్లడించారు. టీచర్స్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్ధి షేక్ సాబ్జీ ( UTF Candidate Shaik sabji) 1537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్ సాబ్దీకు 7 వేల 987 ఓట్లు రాగా, సమీప అభ్యర్ధి గంధం నారాయణరావుకు 6 వేల 453 ఓట్లు వచ్చాయి. గతంలో ఇదే స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యూటీఎఫ్ అభ్యర్దే విజయం సాధించారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిధిలో యూటీఎఫ్ (UTF) బలంగా ఉండటమే విజయానికి కారణంగా తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతా ఓటు రెండవ రౌండ్ లెక్కింపులోనే షేక్ సాబ్దీ విజయం కైవసం చేసుకోవడం విశేషం.
మరోవైపు కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ( Krishna-Guntur Teachers mlc ) ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్ధులున్నా..ప్రధాన పోటీ ఐదుగురి మధ్య నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు, మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 13 వేల 575 ఓట్లకు గానూ 12 వేల 554 ఓట్లు పోలయ్యాయి.
Also read: Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook