చంద్రబాబు తీరుపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు తీరుపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

Updated: Nov 14, 2019, 08:04 PM IST
చంద్రబాబు తీరుపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్‌కి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న దీక్షను వల్లభనేని వంశీ తీవ్రంగా తప్పుపట్టారు. ''వర్షాలు, వరదల్లో కూడా ఇసుక తీయడం కుదురుతుందా అని ప్రశ్నించిన వంశీ.. వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం చంద్రబాబు వద్ద ఉందేమో'' అని ఎద్దేవా చేశారు. అసలు ఏ రకమైన ఫలితాలు ఆశించి టీడీపీ నేతలు ఇసుక దీక్షలు చేస్తున్నారో చెప్పాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు.  

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రతిపక్షమైన టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై వంశీ మాట్లాడుతూ.. ''డబ్బున్న వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతుంటే పేదవారు మాత్రం చదవకూడదా'' అని ప్రశ్నించారు. ''మంచి పనులు ఎవరు చేసినా స్వాగతించాలని.. అందుకే ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నాను'' అని వంశీ స్పష్టంచేశారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తానని.. వైఎస్ జగన్‌‌తో కలిసి నడుస్తానని వంశీ తేల్చిచెప్పారు.