వాల్మీకి, బోయ కులాలను ఎస్టీలో చేర్చుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఎన్నో రాష్ట్రాల్లో ఈ కులాలు ఎస్టీలో ఉండడం వల్ల, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పద్ధతి కొనసాగించేందుకు ఈ కులాలను ఎస్టీ క్యాటగరీలో చేర్చుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో షెడ్యూల్ తెగలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ల అమలు ఉండాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు.
వాల్మీకి, బోయల సంస్కృతి, ఆర్థిక స్థితిగతులు, ఈ కులాలను ఎస్టీలో చేర్చాల్సిన అవసరం గురించి తెలియజేసిన పలు కమిటీలు, కమీషన్లు అందించిన రిపోర్టులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వీరిని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టక ముందు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కాపులను బీసీలుగా పరిగణించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు.