ఈ8న విశాఖకు విచ్చేయనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు వెంకయ్య విశాఖలో పర్యటించనున్నారు.

Updated: Feb 7, 2020, 01:06 PM IST
ఈ8న విశాఖకు విచ్చేయనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 8న వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి విచ్చేయనున్నారు. మూడు రోజులపాటు ఏపీలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి ఫిబ్రవరి 10న ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నెల 8న ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు బయలుదేరతారు. తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గీతం వర్సిటీ కార్యక్రమాలతో పాటు నగరంలో జరిగే పలు ఈవెంట్లకు హాజరుకానున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటనకు సంబంధించి మరిన్ని తెలియాల్సి ఉంది. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..