Vizag Steel plant Issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరోసారి రచ్చకెక్కుతుండటంతో తెలుగుదేశం నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ విషయంలో తెలుగుదేశం నేతలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు వర్సెస్ వైసీపీ నేత విజయసాయి రెడ్డి మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పలువురు ఎంపీలు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. అందుకు తగ్గట్టే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దాంతో కార్మిక సంఘాలు మరోసారి ఉద్యమబాట పడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్లైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేసిన పోరాటం గురించి గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా, గత చరిత్ర తెలియకుండా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. గతంలో వైసీపీ చేసిన పోరాటానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు చిత్తశుద్ధి లేదని, స్వీయ ప్రగల్భాలు, అబద్ధాలకు మారుపేరని విమర్శించారు.
ఈ క్రమంలో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై కూటమి నేతలపై ముఖ్యంగా చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, తగ్గుతున్న ఉత్పత్తితో ఆందోళన పెరుగుతోంది. కార్మికుల ఆందోళన పెరుగుతోంది. ఎన్డీఏ పార్టీల్ని టార్గెట్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటికే రెండు ప్లాంట్లు మూసివేశారని, మూడోది కూడా నిలిపివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థగా నిలబెట్టే పోరాటం లో వైస్సార్సీపీ పాత్ర గురించి చిత్తశుద్ధి లేని, స్వీయప్రగల్భాలకు, అబద్ధాలకు మారుపేరైన తెలుగుదేశంపార్టీ, ఆ పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు శ్రీ గంటా శ్రీనివాసరావు శుక్రవారం 13వ తారీఖున పత్రికాసమావేశం లో వైస్సార్సీపీ వైజాగ్… pic.twitter.com/hvCy4i6FTp
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2024
వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శలు తీవ్రతరం చేస్తున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Also read: Fake News Spread: బుడమేరుకు మళ్లీ గండి వార్తలు కలకలం.. వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.