Tirupati by polls: తిరుపతి ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ శాతం

Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటివరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. చివర్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్‌తో బాధపడుతున్న పేషంట్స్‌కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2021, 07:36 AM IST
Tirupati by polls: తిరుపతి ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ శాతం

Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తిరుపతిలో 78 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు కేవలం 55 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్టు ఓటింగ్ సరళి గణాంకాలు చెబుతున్నాయి. 

Also read: AP Corona Second Wave: సెక్రటేరియట్ ఉద్యోగులకు కరోనా సెగ, వర్క్ ఫ్రం హోం కోసం ఉద్యోగుల విజ్ఞప్తి

సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్‌తో బాధపడుతున్న పేషంట్స్‌కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే2న తిరుపతి ఉప ఎన్నికకు (Tirupati by-polls) సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News