AP Elections: 175 లక్ష్యంగా సీఎం జగన్‌ వ్యూహం.. ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల సమరశంఖం

YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్‌ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 07:00 PM IST
AP Elections: 175 లక్ష్యంగా సీఎం జగన్‌ వ్యూహం.. ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల సమరశంఖం

Jagan Launch Election Campaign: మరొకసారి అధికారమే లక్ష్యంగా అడుగులు.. చేసిన పనులే ఎన్నికల అస్త్రాలు.. మూకుమ్మడిగా వస్తున్న ప్రత్యర్థులు.. వీరందరినీ మరోసారి ఒంటరిగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. త్వరలోనే ఎన్నికల సమరంలోకి దూకనున్నారు. తనకు కలిసొచ్చిన ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 25న భీమిలి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావం పూరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6వేల మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో ఆరోజు సీఎం సమావేశమవుతారని తెలిపారు. భీమిలి బహిరంగ సభతో పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్ధేశం చేస్తారని వివరించారు. పార్టీలో అసంతృప్తుల తొలగింపు, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పునకు గల కారణాలను నేరుగా వివరిస్తారని చెప్పారు. 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి.. వచ్చే ఎన్నికలలో 175కు 175 లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సభ ద్వారా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ చేయాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా మొదటి ఎన్నికల సభనే భీమిలిని ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పడానికి ఈ సభ దోహదం చేస్తుందని వైసీపీ వర్గాల భావన. ఎన్నికల సమరానికి రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి సమావేశాలు నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది. రెండు నెలల్లో జరుగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చడంపై సమావేశాల్లో చర్చిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక కొలిక్కి
సార్వత్రిక ఎన్నికల కోసం మూడు నెలల నుంచే సీఎం జగన్‌ కసరత్తు ప్రారంభించారు. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలను చూసిన అనంతరం వైసీపీలో అనూహ్యంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటిదాకా సిట్టింగ్‌లకు సీట్లు ఖాయమని భావించగా.. తెలంగాణ ఫలితాలతో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకు ఎసరు వచ్చిపడింది. ఇప్పటివరకు ఐదు విడతలుగా అభ్యర్థుల మార్పు జరిగింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారుచేసి భీమవరం సభకు పార్టీ అధినేత సీశ్రీం జగన్‌ వెళ్తారని తెలుస్తోంది. నీచపు రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేలా సీఎం జగన్‌ రాజకీయ వ్యూహం రచించారని సమాచారం. ఇటీవల కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కొంత భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. రాజకీయంగా.. కుటుంబపరంగా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ప్రజల ముందు ఉంచేలా సీఎం జగన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.

Also Read: WINGS INDIA: హైదరాబాద్‌లో విమానాల పండుగ.. షో చూస్తే వావ్‌ అంటారు

Also Read: Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News