YSRCP Formation Day: జగన్‌ సమర్థుడైన సీఎం.. ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి: డిప్యూటీ సీఎం ధర్మాన

YSRCP Formation Day. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నడుస్తోందని, ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 01:06 PM IST
  • జగన్‌ సమర్థుడైన సీఎం
  • ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి
  • 12వ వసంతంలోకి వైసీపీ
YSRCP Formation Day: జగన్‌ సమర్థుడైన సీఎం.. ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి: డిప్యూటీ సీఎం ధర్మాన

YSRCP Formation Day, AP Deputy CM Dharmana hails CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నడుస్తోందని, ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌సీపీ) 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ... 'మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. వైఎస్ జగన్ పరిపాలనలో ఏపీ బాగుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయడమే. రాష్ట్రానికి మరో మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి పట్టం కడతారు' అని అన్నారు. 

'దేశ వ్యాప్తంగా బేరీజు వేస్తే.. ఇతరులు సాధించడానికి ఏమీ లేకుండా మనం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లోనూ 90 శాతం మనకే వచ్చాయి. ఆఖరికి కుప్పంలో కూడా విజయదుందిబి మోగించాం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమం అంటే జగన్.. జగన్ అంటే సంక్షేమం. ఎన్నో కష్టాలు పెట్టినా జగన్ వేరవలేదు. ఇప్పుడు రాష్ట్రమంతా జగన్ అంటున్నారు' అని పొలిట్ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. 

Also Read: Petrol Price: వినియోగదారులకు భారీ షాక్.. లీటర్ పెట్రోల్ పై రూ.50, డీజిల్ పై రూ.75 పెంపు! ఆల్‌టైమ్ రికార్డు!!

Also Read: Omicron Lockdown: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్! ఆసక్తికర విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News