Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలు

Ys Jagan Challenge: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఎవరు చీటర్, ఎవరు ప్రజల్ని మోసం చేశారో చెప్పాలంటూ లెక్కలతో సహా చిట్టా విప్పేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసినందుకు ఏం చేయాలంటూ నిలదీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2024, 11:58 PM IST
Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలు

Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన ఆయన చాలా వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిన వైనాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నానంటూ గణాంకాలు వెల్లడించారు. ఎవరు చీటర్ అని, 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి బడ్జెట్‌లో ఎగ్గొట్టిన నీవు చీటర్ కాదా, చేసింది మోసం కాదా అని వైఎస్ జగన్ మండిపడ్డారు. 18 ఏళ్ల నిండిన మహిళకు నెలకు 1500 చొప్పు ఏడాదికి 18 వేలు అంటే మొత్తం 37,313 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఎంత ఇచ్చావని జగన్ నిలదీశారు. దీపం పధకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల చొప్పున 4115 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఎన్ని కోట్లు కేచాయించావని ప్రశ్నించారు. తల్లికి వందనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షలమంది పిల్లలకు 12,450 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎంత ఇచ్చావని అడిగారు. ఇక అన్నదాత పథకంలో భాగంగా ప్రతి రైతుకు ఏడాదిలో 20 వేల చొప్పున 10,716 కోట్లయితే ఎంత ఇచ్చావన్నారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకూ అతీ గతీ లేదని, యువగళంలో భాగంగా 20 లక్షలమంది ఉపాధి ఏదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇక నిరుద్యోగులకు 3 వేల రూపాయల చొప్పున 7200 కోట్లుంటే ఎంత ఇచ్చావని, ఎప్పుడిస్తావని నిలదీశారు. రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఏడాదిలో 48 వేలయితే మొత్తం 8,160 కోట్లు అవసరమౌతాయని, ఎంత ఇచ్చావని, ఎప్పుడిస్తావని మండిపడ్డారు. 

ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తున్న నీపై ఇన్ని మోసాలు చేసినందుకు ఎందుకు 420 కేసు పెట్టకూడదని జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులంతా నీ కేసులకు భయపడరని, నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారని హెచ్చరించారు. చంద్రబాబు వ్యవహారం ఆర్గనైజ్డ్ క్రిమినల్‌లా ఉందని, అప్పులపై విష ప్రచారం ఇంకా మానలేదని మండిపడ్డారు. రెండేళ్ల నుంచి అప్పుల విషయంలో కుట్ర ప్రకారం వ్యవహరిస్తున్నారన్నారు. 

సంపద సృష్టిస్తానంటే అప్పుులు చేయడమా అని మండిపడ్డారు వైఎస్ జగన్. నిలదీస్తే కేసులు పెట్టడం లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబుకు తెలుసని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబూ నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ విషయంలో మొదటి ట్వీట్ చేస్తున్నానని, పార్టీ కార్యకర్తలందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దామని సవాలు విసిరారు. అరెస్టులు మొదలైతే తనతోనే జరగాలని తేల్చి చెప్పారు. 

Also read: Hollywood Heroine: మహేశ్ అభిమానులకు గుడ్‌న్యూస్, రాజమౌళి సినిమా హీరోయిన్‌గా హాలీవుడ్ అందగత్తె

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News