విభేదాలున్నా పవన్‌కు మద్దతిస్తాను: రోజా

రాజకీయంగా పవన్ కళ్యాణ్‌తో విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

Last Updated : Apr 22, 2018, 11:06 AM IST
విభేదాలున్నా పవన్‌కు మద్దతిస్తాను: రోజా

రాజకీయంగా పవన్ కళ్యాణ్‌తో విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. స్వలాభం కోసం పవన్‌పై దూషణలు సరికాదని, వ్యక్తిగతంగా ఆయన్ను చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. చిత్రపరిశ్రమలోని వారిపైనో, లేక పవన్‌ కల్యాణ్‌పైనో దూషణలకు దిగడం మంచిదికాదని అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రోజా మీడియాతో మాట్లడుతూ, పైవిధంగా స్పందించారు.

ఇక కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్నిస్తున్న మహిళా సంఘాలు.. మహిళలపై విమర్శలు చేసిన బాలకృష్ణను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. టాలీవుడ్‌ నుంచి కాస్టింగ్‌ కౌచ్‌‌ను తరిమేసే పోరాటంలో బాధితులకు అండగా ఉంటానని అన్నారు. తానూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1991 నుంచి ఉన్నానని, ఇప్పటిదాకా కాస్టింగ్‌ కౌచ్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని రోజా గుర్తుచేశారు. మరోవైపు టీటీడీ పాలకమండలి నియామకంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం విజయవాడలో ఆలయాలను కూల్చేసి ఘటనలను రోజా గుర్తుచేశారు.

Trending News