అమరావతి: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం గరీబ్ గల్యాణ్ యోజన (Garib Kalyan Yojana) పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) లేఖ రాశారు. 81 కోట్ల మంది ఆకలిని తీరుస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు
వ్యవసాయరంగానికి రూ.లక్ష కోట్ల కేటాయించడంపై ప్రధాని మోదీ (Narendra Modi)కి కృతజ్ఞతలు తెలిపారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద కోట్లాది మంది ఆకలి తీర్చడంపై ప్రశంసించారు. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా వలస కూలీలకు సైతం అండగా నిలిచారంటూ ప్రధాని మోదీని వైసీసీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. RGV ‘పవర్ స్టార్’ మూవీ స్టిల్స్ వైరల్
మరోవైపు సొంత పార్టీ నేతలకు, పార్టీకి రఘురామకృష్ణంరాజు తలనొప్పిగా మారారు. పార్టీకి లోబడి ఉండటం లేదని ఇటీవల క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో షోకాజ్ నోటీసులు అందుకుని పార్టీకే షాకిచ్చారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో నోటీసులిచ్చారని, అయితే తమ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటూ ట్విస్ట్ ఇవ్వడం తెలిసిందే. అసలు తమ పార్టీకి క్రమశిక్షణా కమిటీనే లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తి నుంచి నోటీసు జారీ చేయాలని సలహా ఇవ్వడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos