Changes in Post Office Schemes: పోస్టాఫీస్ స్కీంలలో పొదుపు చేసే వారికి అలర్ట్.. ఈ మార్పులు గుర్తుంచుకోండి!

Changes in Post Office Schemes: దేశంలో డబ్బు ఉన్నవారు నుండి లేని వారు కూడా పొదుపు చేసుకోటానికి అందుబాటులో ఉన్న ఏకైక దారి పోస్ట్ ఆఫీస్ పథకాలు. కానీ పోస్ట్ ఆఫీసులో ఉన్న పొదుపు పథకాల వల్ల ఉగ్రదాడులకు మరియు మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకు వచ్చింది. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2023, 04:59 PM IST
Changes in Post Office Schemes: పోస్టాఫీస్ స్కీంలలో పొదుపు చేసే వారికి అలర్ట్.. ఈ మార్పులు గుర్తుంచుకోండి!

Major Changes in Post Office Scheme: భారతదేశంలో పేదవాడి నుండి డబ్బున్న వారి వరకు లక్షల మంది ప్రభుత్వంకు చెందిన పోస్టాఫీస్ ల్లో డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. వందలు మొదలుకుని లక్షల వరకు అక్కడ డిపాజిట్స్ ను చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే పోస్టాఫీస్ ల్లో డబ్బు కొన్ని సార్లు ఉగ్రదాడులకు ఉపయోగపడుతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అందుకే చిన్న మొత్తంలో ఉన్న డబ్బు విషయంలో పట్టింపు లేకున్నా పెద్ద మొత్తంలో పోస్టాఫీస్ లో ఉన్న డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలను ఖాతాదారులు ఇక ముందు నుండి చూపించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. 

ఇందుకు గాను భారత పోస్టల్ విభాగం కీలక ప్రకటన చేయడం జరిగింది. చిన్న మొత్తాల పొదుపులో భాగంగా సేవింగ్స్ చేసిన వారు ఇకపై కేవైసీ పత్రాలను సమర్పించడంతో పాటు ఆదాయపు పన్ను ద్రువీకరణ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 

ముఖ్యంగా రూ.10 లక్షలు ఆ పై పొదుపు చేస్తున్న వారి యొక్క కేవైసీ పత్రాలు మరియు ఆదాయపు పన్ను పత్రాలను సమర్పించేందుకు పోస్టల్ విభాగం ఇప్పటికే గడువు విధించడం జరిగింది. భారీ మొత్తంలో మనీ ల్యాండరింగ్ మరియు ఉగ్రవాద చర్య లకు నిధులు మల్లించకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు మరింత కఠినంగా ఆర్థిక నేరాలను అడ్డుకునే ఉద్దేశ్యంతో కూడా ఈ విధానంను తీసుకు రాబోతున్నారట. 

Also Read: Margadarsi Assets: మార్గదర్శి కేసులో కీలక పరిణామం, 793 కోట్ల చరాస్థుల జప్తుకు సిద్ధం

పోస్టాఫీస్ లో పొదుపు చేస్తున్న కస్టమర్లను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. రూ. 50 వేలు దాటిన కస్టమర్లను తక్కువ రిస్క్‌ ఉన్నవారిగా వర్గీకరించడం జరిగింది. వీరు రెండు పాస్ పోర్ట్‌ సైజ్ ఫోటోలు మరియు గుర్తింపు కార్డు ను ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇక 50 వేల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పొదుపు చేస్తున్న వారు తప్పనిసరిగా కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వడంతో పాటు సెల్ఫ్‌ అటెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రూ.10 లక్షలు దాటిన వారు తప్పనిసరిగా తమ ఆదాయానికి సంబంధించిన ప్రూప్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. 

అంతే కాకుండా తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్‌ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ లో పొదుపు చేసిన వారు వెంటనే ఈ డాక్యుమెంట్స్ ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ముందు ముందు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక వెంటనే సదరు డాక్యుమెంట్స్ తో స్థానికంగా ఉన్న బ్రాంచ్ కి వెళ్తే మంచిది.

Also Read: Pregnancy Symptoms: మహిళల్లో Pregnancy లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ సమయంలో ఎలా ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News