Airtel Recharge: ఎయర్‌టెల్ రీచార్జ్‌తో అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ ఉచితం

Free amazon prime video With Airtel: ఎయిర్‌టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్‌ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్ టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది.

Written by - Pavan | Last Updated : Dec 11, 2022, 04:45 AM IST
Airtel Recharge: ఎయర్‌టెల్ రీచార్జ్‌తో అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ ఉచితం

Free amazon prime video With Airtel: ఎయిర్‌టెల్ రీచార్జ్‌తో అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ ఉచితం.. వినడానికే మస్తు టెంప్టింగ్ ఆఫర్ లా ఉంది కదా. మీరు ఎయిర్ టెల్ వినియోగదారులా ? ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకోవాలని చూస్తున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు మీ సొంతం. ఎయిర్‌టెల్ రూ. 499 లేదా రూ. 699 రీఛార్జ్ ప్లాన్‌లు డిస్నీ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ సహా మరెన్నో ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ రీచార్జ్ ప్లాన్స్ అన్ లిమిటిడె వాయిస్ కాల్స్‌తో పాటు ఉచిత ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్‌ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లను ఉచితంగా అందిస్తోంది. దీనితో పాటు, ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 3 నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుండటం మరో విశేషం.

మీరు ఎదురుచూస్తోంది ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో సేవల గురించే కదా.. అక్కడికే వస్తున్నాం. అమేజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా కావాలనుకుంటే, మీరు 56 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ.699 రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సిందే. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 3GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. అంతేకాదు.. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో 56 రోజుల పాటు అమేజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. మొబైల్ వినియోగదారులకు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ దాదాపు రూ. 499 కాగా, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ సంవత్సరానికి రూ.1499 గా ఉంది. కానీ ఈ రీచార్జ్ ప్లాన్స్‌తో అవి ఉచితంగానే లభిస్తున్నాయి. 

Trending News