Amazon Great Indian Festival: ఆఫర్ తేదీలు ప్రకటించిన అమెజాన్.. ఈ బ్యాంక్‌ కార్డులకు ఆఫర్లే.. ఆఫర్లు!

అమెజాన్‌ పండగ సేల్‌ త్వరలోనే మొదలుకానుంది. ప్రతి సంవత్సరం గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) పేరిట అమెజాన్ (Amazon) నిర్వహించే సేల్‌ ఈసారి కూడా త్వరలో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను అమెజాన్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది. ప్రైమ్‌ మెంబర్లకు (Prime Members) ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. మరో వైపు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 06:16 PM IST
  • త్వరలో అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌
  • అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు కొనసాగనున్న సేల్
  • దాదాపు వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు లాంచ్‌
Amazon Great Indian Festival: ఆఫర్ తేదీలు ప్రకటించిన అమెజాన్.. ఈ బ్యాంక్‌ కార్డులకు ఆఫర్లే.. ఆఫర్లు!

Amazon Great Indian Festival Sale 2021: అమెజాన్‌ పండగ సేల్‌ త్వరలోనే మొదలుకానుంది. ప్రతి సంవత్సరం గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) పేరిట అమెజాన్ (Amazon) నిర్వహించే సేల్‌ ఈసారి కూడా త్వరలో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను అమెజాన్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది. ప్రైమ్‌ మెంబర్లకు (Prime Members) ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. మరో వైపు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించనుంది. 

ఇక అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో (Amazon Great Indian Sale) భాగంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీలు, తదితర వాటిపై అమెజాన్‌ ఆఫర్లు అందిస్తోంది. అమెజాన్‌ ఎకో, ఫైర్‌ స్టిక్‌, కిండ్లే డివైజ్‌లను తక్కువ ధరకే సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. దాదాపు వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అమెజాన్‌ సేల్‌లో భాగంగా లాంచ్‌ కానున్నాయి. 

Also Read : SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే

అమెజాన్‌ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆఫర్లను అమెజాన్‌ అందిస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు ఈ సేల్‌ను అమెజాన్‌ (Amazon) కొనసాగించనుంది.

Also Read : Gangster Jitendra Gogi killed: కోర్టు ఆవరణలోనే కాల్పులు..గ్యాంగ్‌స్టర్‌ హతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News