ATM Cash Withdrawal Charges: ఏటీఎం క్యాష్‌విత్‌డ్రా ఛార్జీలు పెంచిన రిజర్వ్ బ్యాంక్

ATM Cash Withdrawal Charges: కొత్త ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, వాటి నిర్వహణకుగానూ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు, ఏటీఎంలలో పరిమితికి మించి జరిగే ట్రాన్సాక్షన్స్‌పై ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 11, 2021, 09:02 AM IST
  • ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
  • ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజులను సైతం పెంచుతూ నిర్ణయం
  • ఇంటర్‌ఛేంజ్ చార్జీలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి
ATM Cash Withdrawal Charges: ఏటీఎం క్యాష్‌విత్‌డ్రా ఛార్జీలు పెంచిన రిజర్వ్ బ్యాంక్

ATM Cash Withdrawal Fee: ఏటీఎం కేంద్రాలలో నగదు ఉపసంహరణ మించితే వచ్చే ఏడాది నుంచి అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా నగదు ఉపసంహరణకు, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ పరిమితి మించితే రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. 

తొలి 3 నుంచి 5 ట్రాన్సాక్షన్ల వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పనిలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం వసూలుచేస్తున్న రూ.20 ఛార్జీలను రూ.21కు పెంచడంతో పాటు జనవరి 1, 2022 నుంచి నిర్ణయం అమలులోకి రానుందని Reserve Bank Of India తెలిపింది. మరోవైపు ఏటీఎం కేంద్రాలలో ఇంటర్‌ఛేంజ్ క్యాష్ సైతం ఛార్జీలను రూ.15 నుంచి రూ.17 రూపాయలకు, ఆర్థికేతర లావాదేవీలను రూ.5 నుంచి రూ.6కు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. 

Also Read: Bank Timings In Telangana: లాక్‌డౌన్‌లో తెలంగాణ బ్యాంకుల టైమింగ్స్ ఇవే, ఈ 19 వరకు

మెట్రో నగరాలల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 వరకు ఫ్రీ ట్రాన్సాక్షన్స్, ఇతర ప్రాంతాల (Non-Metro Centres)లో ప్రతినెలా 5 వరకు ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసేందుకు వీలుంది. కొత్త ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, వాటి నిర్వహణకుగానూ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు, ఏటీఎంలలో పరిమితికి మించి జరిగే ట్రాన్సాక్షన్స్‌ (ATM Transactions)పై ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు 2014 నుంచి, ఆగస్టు 2012 నుంచి అమలులో ఉన్న ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు త్వరలో మారనున్నాయి. 

Also Read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News