Interest Hiked: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్‌.. అధిక లాభం వచ్చేలా వడ్డీ రేట్ల పెంపు

బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఆకర్షించేందుకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్ స్కీమ్ లో అధిక వడ్డీ ని ఆఫర్‌ చేస్తున్నట్లుగా ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 03:59 PM IST
Interest Hiked: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్‌.. అధిక లాభం వచ్చేలా వడ్డీ రేట్ల పెంపు

Bank of India has Hiked Interest Rates: సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్యాక్‌ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్ స్కీమ్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ ని ఆఫర్‌ చేస్తున్నట్లుగా ప్రకటించింది. గతంలో ఉన్న వడ్డీ రేట్ల తో పోల్చితే కొత్త వడ్డీ రేట్ల వల్ల వినియోగదారులకు పెద్ద మొత్తంలో లాభం దక్కుతుందని సంస్థ ప్రకటించింది. శుభ్‌ ఆరంభ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ కింద కస్టమర్లకు కొత్త వడ్డీ రేట్లను అందించబోతున్నట్లుగా బీఓఐ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. కొత్త వడ్డీ రేట్లను ఏప్రిల్‌ 1, 2023 నుంచే అమలులోకి తీసుకు వచ్చినట్లుగా కూడా పేర్కొన్నారు.

501 రోజుల టెన్యూర్‌ కలిగిన డిపాజిట్‌ ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లు గరిష్టంగా 7.80 శాతం మేరకు వడ్డీని పొందవచ్చు. 60 నుండి 80 ఏళ్ల మద్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు 7.65 శాతం వడ్డీని అందుకుంటారు. శుభ్‌ ఆరంభ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ ద్వారా మాత్రమే ఈ వడ్డీ రేట్లు వస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా బ్యాక్‌ ఆఫ్ ఇండియా నుండి వడ్డీ రేట్ల విషయంలో శుభ వార్త అందింది. 

7 రోజుల నుండి 10 రోజుల టెన్యూర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర బ్యాంక్స్ తో పోల్చితే వడ్డీ రేట్లను అధికంగా అందిస్తోంది. మెచ్యూరిటీ పీరియడ్లలో వ్యత్యాసాన్ని బట్టి వడ్డీ రేట్లను గరిష్టంగా 7.40 శాతం అందించబోతున్నారు. రెగ్యులర్‌ కస్టమర్లకు 6.75 శాతం వడ్డీని ఇస్తున్నారు. డిపాజిట్లను మూడేళ్లు అంతకు మించి ఎక్కువగా ఉంచినట్లయితే సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.75 శాతం.. సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 0.90 శాతం అదనంగా వడ్డీ ని ఇచ్చేందుకు బ్యాంక్‌ ఆఫర్‌ సిద్దం అయ్యింది.

Also Read: Railway Facts: ఈ రైళ్ల మధ్య తేడా తెలుసా..! ఏ ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళుతుందంటే..?

5 ఏళ్ల నుండి 10 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్ పై సీనియర్లకు 6.75 శాతం మరియు సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీ దక్కుతుంది. 270 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్లపై 6 శాతం మరియు 6.15 శాతం వడ్డీని అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక 501 రోజుల స్పెషల్‌ డిపాజిట్స్ ద్వారా 7.65 మరియు 7.80 శాతం వడ్డీని అందిస్తోంది. 

కొత్త వడ్డీ రేట్లు సీనియర్‌ సిటిజన్లు, సూపర్‌ సీనియర్ సిటిజన్స్‌ కి మాత్రమే కాకుండా రెగ్యులర్ కస్టమర్లకు కూడా ఎంతో ప్రయోజనదాయకం అన్నట్లుగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాక్ లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్ కు తక్కువ వడ్డీ అనే విషయాన్ని బ్యాంక్ ఇండియా తాజా వడ్డీ రేట్లతో కొట్టి పారేస్తున్నారు.

Also Read: Realme 11 Pro: "మూన్ మోడ్" ఫీచర్‌తో రియల్‌ మీ నుంచి మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌, డెడ్‌ ఛీప్‌గా లభించబోతోంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News