Discount Offers On CAR: ఈ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. క్యూ కడుతున్న ప్రజలు

Maruti Suzuki Cars Discount Offers: మారుతీ సుజుకి కార్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ కార్లపై కంపెనీ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై దాదాపు రూ.62 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఈ కార్లపై ఎంత ఆఫర్ ఉందో ఇక్కడ తెలుసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 11:49 PM IST
Discount Offers On CAR: ఈ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. క్యూ కడుతున్న ప్రజలు

Maruti Suzuki Cars Discount Offers: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఈ నెలలో కార్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. మారుతీ సుజుకి కంపెనీ తన అనేక కార్లపై వినియోగదారులకు తగ్గింపు ధరతో అందజేస్తున్నాయి. ఆటో K10 నుంచి స్విఫ్ట్ వరకు అనేక మోడల్స్‌పై ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందజేస్తోంది. ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉంది..? ఆఫర్లు ఎలా ఉన్నాయి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

మారుతీ సుజుకి ఆల్టో K10

మారుతీ ఆల్టో 10 పెట్రోల్ వేరియంట్‌లపై రూ.62 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తోంది. ఇందులో రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.7 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఆఫర్ అందుబాటులో ఉంది. సీఎన్‌జీ మోడల్స్‌పై రూ.39 వేల వరకు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Viral Video today: ప్రేమ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయి.. ఈ వీడియో చూడండి..

మారుతీ సుజుకి S-ప్రెస్సో

మారుతీ సుజుకి S-Presso AMT వెర్షన్‌పై రూ.61 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. రూ.40 వేల క్యాష్ తగ్గింపు, రూ.15 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.6 వేల కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్‌పై రూ.56 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. 

మారుతీ సుజుకి సెలెరియో

మారుతీ సుజుకి సెలెరియో కారుపై రూ.61 వేల వరకు ఆఫర్ అందుతోంది. ఇందులో రూ.40 వేల క్యాష్ ఆఫర్, రూ.15 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. మారుతి సుజుకి సెలెరియో CNGపై రూ.36 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

మారుతీ సుజుకి స్విఫ్ట్

మారుతీ సుజుకి స్విఫ్ట్ త్వరలో అప్‌డేట్ రాబోతుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ కారుపై రూ.42 వేల వరకు బెనిఫిట్ ఆఫర్ ఉంది. ఇందులో రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.20 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.7 వేల కార్పొరేట్ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

మారుతీ సుజుకి డిజైర్

మారుతీ సుజుకి డిజైర్ కార్లలో ఈ ఏడాది కొత్త అప్‌డేట్ వర్షన్ రానుంది. డిజైర్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మోడల్‌లో రూ.37 వేల వరకు ఆఫర్ లభిస్తోంది. రూ.15 వేల క్యాష్‌ ఆఫర్, రూ.15 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.7 వేల కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News