Fixed Deposit Account Facts: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఐతే ఇవి తెలుసుకోండి

Fixed Deposit Account Facts: ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే అంతకు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 09:56 PM IST
  • ఎఫ్​డీ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
  • ఉన్న డబ్బంతా ఒకే ఎఫ్​డీలో పెట్టొచ్చా?
  • గరిష్ఠంగా ఎంత మొత్తం ఎఫ్​డీ చేయడం మేలు?
Fixed Deposit Account Facts: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఐతే ఇవి తెలుసుకోండి

Fixed Deposit Account Facts: సురక్షితమైన పెట్టుబడులు అనగానే.. చాలా మందికి గుర్తొచ్చేవి గోల్డ్​, ఫిక్స్​డ్​ డిపాజిట్లు (ఎఫ్​డీ). ఇప్పుడు ఎఫ్​డీల గురించి మాట్లాడుకుందాం. సాధారణ సేవింగ్స్ అకౌంట్​తో పోలిస్తే ఎఫ్​డీ ద్వారా అధిక రిటర్నులు వస్తాయి. అందుకే ఎక్కువ మంది ఎఫ్​డీల్లో పెట్టుబడి పెడతారు.  ఎఫ్​డీలో పెట్టబడి పెట్టేందుకు వివిధ ఆప్షన్స్​ ఉన్నాయి. కనీసం ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ ఎఫ్​డీ పెట్టొచ్చు. ఆ తర్వాత 20 ఏళ్ల వరకు కూడా దీనిని పెంచుకోవచ్చు.

అయితే మీరు కూడా ఎఫ్​డీల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడేలా ఎఫ్​డీలు చేయడం వల్ల ప్రయోదనాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఎఫ్​డీ చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎఫ్​డీకి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

ఇవి తెలుసుకోండి..

ఎఫ్​డీ చేసేందుకు ముందు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు అనుకున్న సమయానికి ఏ బ్యాంకులు సరిపడా రిటర్నులు వస్తాయో దానినే ఎంచుకోవాలి.

మీరు ఎఫ్​డీ చేసే బ్యాంక్​..డిపాజిట్​ ఇన్సూరెన్స్​ అండ్ క్రెడిట్ గ్యారెంటి కార్పొరేషన్​ (డీఐసీజీసీ) వద్ద రిజిస్టర్​ అయ్యిందా లేదా తెలుసుకోవాలి. అప్పుడే బ్యాంక్ దివాలా తీసినా రూ.5 లక్షల వరకు బీమా లభిస్తుంది.

మీ దగ్గర ఉన్న డబ్బునంతా ఒకే బ్యాంక్​లో ఎఫ్​డీ చేయొద్దు. రెండు, మూడు బ్యాంకుల్లో ఎఫ్​డీ చేయాలి. రూ.5 లక్షల కన్నా తక్కువగా ఎఫ్​డీ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

వడ్డీ రేట్లు మారుతుంటాయి కాబట్టి. వివిధ బ్యాంకుల్లో, వివిధ కాలపరిమితితో ఎఫ్​డీ చేయాలి. అప్పుడే వడ్డీల ద్వారా లభించే ఆదాయం అధికంగా ఉంటుంది.
డబ్బు అవసరం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కొంత మొత్తాన్ని తక్కువ కాల పరిమితితో ఎఫ్​డీ చేయాలి. అత్యవసర సమయాల్లో దానిని మధ్యలో ఉపసంహరించుకున్నా.. పెనాల్టీలు పెద్దగా ఉండవు.

Also read: Hero Eddy electric scooter: రూ.72 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్‌తో పనే లేదు!

Also read: GST Collections February 2022: ఐదోసారీ రూ.1.30 లక్షల కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News