Billionaire Changpeng సర్వం పోగొట్టుకున్నా మళ్లీ బజారున పడ్డా.... బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో

Edited by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 01:36 PM IST
  • భారీగా పడిపోయిన లునా వాల్యూ
    మళ్లీ పేదవాడిని అయ్యానంటోన్న బిలీనియర్ ట్వట్
    ప్రస్తుతం 2,200 డాలర్లకు పడిపోయిన లూనా వ్యాల్యూ
Billionaire Changpeng సర్వం పోగొట్టుకున్నా మళ్లీ బజారున పడ్డా.... బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో

Billionaire Changpeng  ఇంటర్నెట్ రాకన్నా ముందు అంతా సంప్రదాయబద్ధమైన జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అంతా టైం ప్రకారం నియమబద్ధంగా జరిగిపోయేది. ఉన్నదాంట్లో హాయిగా సంతృప్తిగా బతికేస్తూ లైఫ్‌ ని ప్రశాంతగా బతికేసే వాళ్లు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రశాంతత కంటే ఎంజాయ్‌మెంట్‌కు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నారు.సరదాలు, సంతోషాల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో డబ్బు అవసరం గణనీయంగా పెరిగిపోయింది. ఇక ఆ డబ్బును సంపాదించేందుకు కూడా ఎన్ని పడరానిపాట్లు పడాలో అన్ని పాట్లు పడుతున్నారు. ఇక అలా సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేందుకు కూడా అదే విధంగా కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.

ఇలాంటి వాళ్ల సంఖ్య పెరిగిపోవడంతో పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ... లెక్కల్లోకి రాని డబ్బును పెట్టుబడి పెట్టుకునేందుకు.. ప్రభుత్వ నియంత్రణ లేని లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆస్కారం ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే ఫిజికల్‌గా మనుగడలోలేని ఈ డిజిటల్ కరెన్సీని చెలామణి చేయడంలో ఉన్న సాధకబాధకాల కారణంగా క్రమంగా క్రిప్టో క్రేజ్ మాయం అవుతోంది. దీంతో క్రిప్టోకు డౌన్ ట్రెండ్ స్టాట్ అయింది. దీంతో అప్పటి వరకు ఎనలేని సంపదను పోగు చేసుకున్న ఆయా క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకులు ... మార్కెట్‌లో క్రిప్టో షేర్‌ వ్యాల్యూ పడిపోవడంతో ఇప్పుడు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

ఇందుకు సజీవ సాక్ష్యం క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ వ్యవస్థాపకుడు, బిలీనియర్ చాంగ్‌పెంగ్ జావో చేసిన ప్రకటనే. తాను మళ్లీ పేదవాడిని అయిపోయానంటూ ఆయన ప్రకటించారు.  లునా వాల్యూ భారీగా క్రాష్ కావడంతో తన సంపద అంతా ఆవిరైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రిప్టో విలువ 1.6 బిలియన్ డాలర్ల నుంచి 2,200 డాలర్లకు పడిపోయిందని దిగులు చెందుతున్నాడు. ఈ వాల్యూ జీరో క్రాష్ తో తాను మళ్లీ రోడ్డున పడ్డానని చెప్తున్నాడు. లునా కుప్పకూలడంతో తాను ఏకంగా బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయాని బోరు మంటున్నాడు. పూర్ అగైన్ అంటూ ఆయన పెట్టిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించెదరు అని ఓ సిని కవి రాసి పాట అప్పట్లో చాలా హైలెట్ అయింది. అయితే ఇప్పుడు ఇలాంటి వారిని చూస్తుంటే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది.

also read Old Currency Sale: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉండే మీరే కోటీశ్వరులు!

also read Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్, తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News