Old Currency Sale: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉంటే మీరే కోటీశ్వరులు!

Old Currency Sale: మీ దగ్గర పాత, అరుదైన నాణేలతో పాటు నోట్లను కలిగి ఉంటే వాటి ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. ఆన్ లైన్ లో నోట్లను విక్రయించడం వంటి సులభమైన మార్గం ద్వారా డబ్బును సంపాదించవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 06:52 PM IST
Old Currency Sale: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉంటే మీరే కోటీశ్వరులు!

Old Currency Sale: మీరు పని చేయకుండా త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటే ఇదిగో మీకు గొప్ప అవకాశం. ఇంటి నుంచే బయటకు రాకుండానే కోటీశ్వరులుగా మారేందుకు అవకాశం ఉంది. కరెన్సీ నోట్లలో ఒక్కో నోట్కు ఒక్కో ప్రత్యేక విలువ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గతంలో విడుదల చేసిన ఒక రూపాయి నోటులో భారత ఆర్థిక కార్యదర్శి సంతకం ఉన్నందున, దేశంలోని 1 రూపాయి నోటు మినహా మిగిలిన నోట్ల విలువకు బాధ్యత వహిస్తారు.

ఆన్ లైన్ లో విక్రయం..

మీ దగ్గర ఈ ప్రత్యేకమైన 1 రూపాయి నోటు ఉంటే మీరు ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ పురాతనమైన కరెన్సీ నోటుకు అంతర్జాతీయ మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది. వాటిని విక్రయించడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుతారు. ఇలాంటి అరుదైన నోట్లు, నాణేలను వేలం వేసే పనిని చాలా వెబ్‌సైట్లు చేస్తుంటాయి. 

దీని కోసం అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్లలో OLX ఒకటి. అందులో ఓ లాగిన్ IDని సృష్టించి వీటిని వేలం వేయోచ్చు. indiamart.comలో ఎవరైనా తమ IDని సృష్టించడం ద్వారా నాణేలను వేలం వేయవచ్చు. వేలం కోసం మీరు తప్పనిసరిగా మీ నాణెం యొక్క ఫోటోను షేర్ చేయాలి.

పాత కరెన్సీ నోట్లను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

1) www.olx.comకి వెళ్లండి.

2) ఆ వెబ్‌సైట్‌లో మిమ్మల్ని మీరు 'విక్రేత'గా నమోదు చేసుకోండి. అయితే, మీరు ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే నమోదిత విక్రేత అయితే, మీరు నేరుగా లాగిన్ చేయవచ్చు.

3) లాగిన్ అయిన తర్వాత మీరు విక్రయించాల్సిన కరెన్సీ నోట్లు, కాయిన్స్ గురించి చిత్రాన్ని అప్ లోడ్ చేయాలి. దీని ద్వారా మీరు ఇచ్చే ప్రకటనలు నిజమైనవని తెలుస్తోంది. ఆ తర్వాత మీరు విక్రయించాల్సిన నోటు ధరను సెట్ చేయాలి. 

4) మిగిలిన వివరాలను పొందుపరచిన తర్వాత పాత నోట్లు, నాణేలను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తారు.

5) మీరు మీ కాయిన్‌ను కావలసిన ధరకు విక్రయించడానికి కొనుగోలుదారులతో చర్చలు జరపవచ్చు.

మొదటి రూ.1 నోటు ఎప్పుడు ముద్రించారు?

భారతదేశంలో తొలిసారిగా రూపాయి నోటు 1917 నవంబర్ 30వ తేదీన ముద్రించారు. మీడియా కథనాల ప్రకారం.. 1926లో ఈ రూపాయి నోటు ముద్రణను నిలిపివేశారు. అయితే అది మళ్లీ 1940లో ప్రారంభమైంది. అదే సమయంలో 1994లో ఒకసారి ఒక రూపాయి నోటు ముద్రణ నిలిపివేశారు. అయితే 1 జనవరి 2015 నుండి మళ్లీ ముద్రణ ప్రారంభమైంది.

Also Read: Prepaid Tariff Hike: ప్రీపెయిడ్ యూజర్లకు భారీ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్!

Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. రూ.12 వేలకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News