Best Mileage Bike: చీప్ అండ్ బెస్ట్ బైక్.. ధర రూ. 65 వేలలోపు.. మైలేజ్ 75 కి.మీ

Cheap And Best Mileage Bike in india: ఈ బైక్ నాలుగు వేరియంట్స్, నాలుగు కలర్లలో లభిస్తుంది. అందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.62,638 గా ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ.79,282 గా ఉంది. గ్రామీణ పరిస్థితులను, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన బైక్ ఇది.

Written by - Pavan | Last Updated : Apr 16, 2023, 07:33 PM IST
Best Mileage Bike: చీప్ అండ్ బెస్ట్ బైక్.. ధర రూ. 65 వేలలోపు.. మైలేజ్ 75 కి.మీ

Cheap And Best Mileage Bike in india: రోజు వారి పనిలో భాగంగా బైక్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చాలామంది చీప్ అండ్ బెస్ట్ బైక్ కోసం వెతుకుతుంటారు. ఈ రోజు మేము మీకు అలాంటి బైక్ గురించే చెప్పబోతున్నాం. ఈ బైక్ విశిష్టతలు తెలిస్తే మీరు కూడా అవాక్కవుతారు. పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో రోజువారీ ప్రయాణానికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే.. ఇదిగో ఈ డీటేల్స్ చూడండి. ఈ బైక్ లీటరుకు 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటోంది మరేదో బైక్ గురించి కాదు.. ఇండియాలో ఎప్పుడో పాపులర్ అయిన బజాజ్ ప్లాటినా 100 బైక్ గురించే. 

ఇండియన్ మార్కెట్లో బజాజ్ ప్లాటినాకు మంచి డిమాండ్ ఉంది. అందుకు కారణం తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతి కొద్ది బైకుల్లో బజాజ్ ప్లాటినా ముందు ఉంటుందనే విశ్వాసం ఉండటమే. బజాజ్ ప్లాటినా బైక్స్ నాలుగు వేరియంట్స్, నాలుగు కలర్లలో లభిస్తుంది. అందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.62,638 గా ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ.79,282 గా ఉంది. బజాజ్ ప్లాటినా 100 బైక్ గ్రామీణ పరిస్థితులను, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన బైక్. ఈ బైక్ కిక్ స్టార్ట్ సిస్టం, ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్లలో లభిస్తుంది. బైక్ ఫ్రంట్ బ్రేక్స్, రియర్ బ్రేక్స్ రెండూ డ్రమ్ బ్రేక్స్ తో రూపొందింది. 

ఇంజన్ పవర్
100 సిసి ఇంజన్ తో తయారైన బజాజ్ ప్లాటినా 100 కి 7.8 బిహెచ్‌పి పవర్, 8.34 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 4 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టం ఈ బైక్ సొంతం. కొత్తగా అమలులోకి వచ్చిన BS6 నిబంధనల ప్రకారం.. బజాజ్ ప్లాటినా మైలేజ్ కార్బ్యురేటర్ నుండి ఫ్యూయల్ ఇంజెక్షన్‌కి చేంజ్ చేశారు. దూర ప్రయాణాల్లోనూ బైక్‌ రైడింగ్ లో సౌకర్యం కోసం సాఫ్ట్ సీట్ కుషన్, రబ్బర్ ఫుట్‌ప్యాడ్, డైరెక్షనల్ టైర్స్ అమర్చారు. బజాజ్ ప్లాటినా 100 టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్యూయల్ షాక్ అబ్జార్వరతో 17-అంగుళాల అల్లాయ్డ్ వీల్స్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ బైక్ ఫ్రంట్ టైర్లకు డిస్క్ బ్రేక్స్ అమర్చారు.

Trending News