Get a Credit Cards Without Annual Fee: ఇదిలావుండగానే బ్యాంకింగ్ సెక్టార్ లో పెరిగిపోతున్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడేందుకు కొన్ని బ్యాంకులు, కస్టమర్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు ఇంకొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు అందిస్తున్నాయి. అందులో యాన్వల్ జీరో ఫీతో క్రెడిట్ కార్డ్స్ అందిస్తూ.. అదనంగా ఇంకొన్ని ఆఫర్స్ కూడా అందిస్తున్న బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యస్ బ్యాంక్, బ్యాంక్ బజార్
యస్ బ్యాంక్, బ్యాంక్ బజార్ కలిసి సంయుక్తంగా అందిస్తున్న కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుకి యాన్వల్ ఫీ లేకపోగా.. ఎప్పటికప్పుడు నెల వారీగా క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకునేలా డ్యాష్‌బోర్డ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. పైగా రూ. 400 నుంచి 5000 వేల మధ్య జరిపే ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్ సర్‌చార్జ్‌పై 1 శాతం వైవర్ కూడా అందుబాటులో ఉంది.
ఆర్బిఎల్ బ్యాంక్ బజార్ సేవ్ మ్యాక్స్ క్రెడిట్ కార్డ్
రూ. 2500 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే ఏ లావాదేవీలనైనా EMI ఆప్షన్స్ లోకి మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. ఎక్స్ ప్రెస్ క్యాష్ పేరిట మీ బ్యాంకులోకి ఇన్ స్టాంట్ డబ్బులను క్రెడిట్ చేసే సౌకర్యం అందిస్తోంది. డాక్యుమెంటేషన్ లేకుండానే ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కూడా అందిస్తోంది.
హెచ్ఎస్‌బిసి ప్లాటినం కార్డ్
కాంప్లిమెంటరీ ట్రావెల్ ఓచర్స్‌తో పాటు ప్రతీ సంవత్సరం రూ. 3 వేల విలువైన మూవీ ఓచర్స్ కూడా అందిస్తోంది. ఇవే కాకుండా కార్డు జారీ అయిన తొలి 60 రోజులలో జరిపే లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్లాటినం కార్డు
ఇండస్ ఇండ్ బ్యాంక్ ట్రావెలింగ్ సమయంలో టికెట్ బుకింగ్స్, ప్రీమియం హోటల్ బుకింగ్స్ పై ఆఫర్స్ అందివ్వడంతో పాటు ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్ పై సైతం ఆఫర్స్ అందిస్తోంది.
కొటక్ ఫార్చూన్ గోల్డ్ క్రెడిట్ కార్డు
కొటక్ మహీంద్రా బ్యాంకు ఏటీఎంలతో పాటు వీసా ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రావల్స్ చేసుకోవచ్చు. కొటక్ మహింద్రా బ్యాంకులలో క్యాష్ డ్రా చేసుకోవడం లేదా మరొకరి ఎకౌంట్ కి నగదు బదిలీ వంటి లావాదేవీలు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారానే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయొచ్చు.
యాక్సిస్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డు
క్రెడిట్ కార్డుపై నూటికి నూరు శాతం క్యాష్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా లావాదేవీలపై 50 రోజుల వరకు ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు సేవలు వినియోగించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook