Apple Saket: దేశంలో రెండో యాపిల్‌ స్టోర్‌ ప్రారంభం.. ఢిల్లీలో మెుదటిది ఇదే..!

Apple's first store in Delhi: ఢిల్లీలో మెుదటి యాపిల్ స్టోర్ ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ ఢిల్లీ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా వ్యవహారిస్తున్నారు. తొలి స్టోర్ ను రెండు రోజుల కిందట ముంబైలో ప్రారంభించన సంగతి తెలిసిందే.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 01:08 PM IST
Apple Saket: దేశంలో రెండో యాపిల్‌ స్టోర్‌ ప్రారంభం.. ఢిల్లీలో మెుదటిది ఇదే..!

Apple's Second store in India: దేశంలో మరో యాపిల్ స్టోర్ ఓపెన్ అయింది. ఇవాళ ఉదయం 10 గంటలకు భారత్ లో రెండో యాపిల్ స్టోర్ ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ ఢిల్లీ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌ (Apple Saket)గా పిలుస్తున్నారు.  ముంబయిలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ బీకేసీ (Apple BKC) పేరిట తొలి స్టోర్‌ను ఏప్రిల్‌ 18న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయశాలను ‘సెలెక్ట్‌ సిటీవాక్‌’ మాల్‌లో ఏర్పాటు చేశారు. 

ముంబై యాపిల్ స్టోర్ తో పోలిస్తే ఈ విక్రయశాల చాలా చిన్నది. దీని ఓపెన్ సందర్భంగా కుక్‌తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు కస్టమర్లు పోటీ పడ్డారు. ఢిల్లీలో గల యాపిల్‌ స్టోర్ లో 18 రాష్ట్రాల చెందిన 70 మంది నిపుణులైన యాపిల్‌ ప్రతినిధులు కస్టమర్లకు సేవలు అందించనున్నారు. వీరంతా మెుత్తం 15 భాషలను మాట్లాడనున్నారు. ఈ ఉద్యోగుల్లో సగం మంది మహిళలే కావడం విశేషం. 

Also Read: Richest Cities In India 2023: ఇండియాలో అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్.. నెంబర్ 1 ఏదంటే..

యాపిల్ స్టోర్లను ప్రారంభం నిమిత్తం ఈనెల 17న టిమ్ కుక్ భారత్ కు వచ్చారు. ఏప్రిల్ 18న ప్రధాని మోదీని కలిశారు. వరల్డ్ లో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్‌ పేర్కొన్నారు. ఇక్కడి అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతులకూ తయారీ కేంద్రంగా దేశాన్ని మార్చాలని అనుకుంటున్నట్లు టిమ్ కుక్ తెలిపారు. 

Also Read: Meta Lay offs: కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మెటాలో మరో 10 వేల మంది తొలగింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News