Tesla chief elon musk: తెలంగాణకు పోటీగా పశ్చిమ బెంగాల్.. గెలుపు ఎవరిదో!

Elon Musk gets invitation from West Bengal minister Md Ghulam Rabbani : టెస్లాకు ఆహ్వానం పలికే విషయంలో తెలంగాణ‌కు పోటీగా పలు రాష్ట్రాలు దిగాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాలు టెస్లా త‌యారీ యూనిట్ ఏర్పాటు చేయాల‌ంటూ ఎల‌న్‌మ‌స్క్‌ను ఆహ్వానించాయి. టెస్లాను దక్కించుకోవడంలో గెలుపు ఎవరికి దక్కుతుందో మరి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 03:55 PM IST
  • టెస్లాను భారత్‌కు ఆహ్వానిస్తున్న పలు రాష్ట్రాలు
  • రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ
  • తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి టెస్లాకు ఆహ్వానం
Tesla chief elon musk: తెలంగాణకు పోటీగా పశ్చిమ బెంగాల్.. గెలుపు ఎవరిదో!

Elon Musk gets invitation from West Bengal minister Md Ghulam Rabbani to set up business in Bengal : ప్రస్తుతం టెస్లా (Tesla) కోసం భారత్‌లోని పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ అయిన టెస్లాను భారత్‌కు ఆహ్వానిస్తున్నాయి పలు రాష్ట్రాలు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల (States) మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను (Elon Musk) భారత్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నాయి.

ఇటీవల ఎలన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ఒక ట్వీట్ తో రాష్ట్రాలు ఇలా స్పందిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఒక నెటిజెన్ భార‌తదేశంలో టెస్లా కార్ల ప్రవేశం ఎప్పుడని ఎలన్‌ మస్క్‌ను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భారత్‌లో తమ టెస్లా (Tesla) కంపెనీ ఏర్పాటుకు భార‌త ప్రభుత్వ నిర్ణయాలు అడ్డంకిగా ఉన్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామంటూ టెస్లా కంపెనీ ట్వీట్‌ చేసింది. 

కాగా ప్రస్తుతం టెస్లా ప్లాంట్‌ను దక్కించుకునేందుకు పలు రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడింది. పలు రాష్ట్రాలు టెస్లా కంపెనీతో చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. తెలంగాణలో (Telangana) టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయండంటూ ట్విట్టర్‌ వేదికగా ఎలన్‌మస్క్‌కు.. కేటీఆర్‌ ఆహ్వానం పలికారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఇప్పటికే చాలా అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటూ ఎలన్‌ మస్క్‌కు (Elon Musk) ఆహ్వానం పలికారు కేటీఆర్. టెస్లా కార్యకలాపాల్లో భార‌త్ కానీ, తెలంగాణ కానీ భాగస్వామ్యమయితే చాలా సంతోషిస్తానంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇక మంత్రి కేటీఆర్ (KTR) టెస్లా కారును న‌డిపిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు.

అయితే తెలంగాణ‌కు పోటీగా మహారాష్ట్ర (Maharashtra) కూడా రంగంలోకి దిగింది. టెస్లా త‌మ రాష్ట్రానికి వస్తానంటే రెడ్‌ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతామంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. (Maharashtra Government) మ‌హారాష్ట్ర దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రం, ఇక్కడ మీ త‌యారీ కేంద్రం ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతున్నామంటూ మహారాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ (Maharashtra Minister Jayant Patil) ట్వీట్‌ చేశారు. ఎలన్‌మస్క్‌ (Tesla CEO Elon Musk) చేసిన ఒక ట్వీట్‌ను జయంత్‌ పాటిల్‌ రీట్వీట్‌ చేస్తూ.. టెస్లా కంపెనీని భారత్‌లో స్థాపించేందుకు మహారాష్ట్ర నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

ఇక టెస్లా కంపెనీనీ తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయడంటూ తాజాగా పశ్చిమబెంగాల్‌ ముందుకొచ్చింది. బెంగాల్‌ అంటేనే బిజినెస్‌ అంటూ పశ్చిమబెంగాల్‌ మంత్రి మ‌హ్మద్ గులాం ర‌బ్బానీ (Bengal minister Md Ghulam Rabbani) పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఉత్తమ మౌలిక వ‌స‌తులు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గులాం ర‌బ్బానీ టెస్లాను ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్‌లో అత్యుత్తమ ఇన్‌ఫ్రా ఉందని, తమ నాయకురాలు సీఎం మమతా బెనర్జీకు మంచి విజన్ ఉందంటూ మంత్రి మ‌హ్మద్ గులాం ర‌బ్బానీ పేర్కొన్నారు.

అలాగే పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్దూ (Punjab Congress chief Navjot Singh Sidhu) కూడా టెస్లా కంపెనీనీ ఆహ్వానించారు. పంజాబ్‌లో (Punjab) టెస్లా త‌యారీ యూనిట్ ఏర్పాటు చేయాల‌ంటూ ఎల‌న్‌మ‌స్క్‌ను ఆహ్వానించారు నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్దూ. లుధియానాలో (Ludhiana) ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్, బ్యాట‌రీ ఇండ‌స్ట్రీ హ‌బ్ క్రియేట్ చేస్తామంటూ సిద్దూ పేర్కొన్నారు. అలాగే పంజాబ్‌కు కొత్త టెక్నాల‌జీతో పెట్టుబ‌డులు పెట్టడానికి వ‌చ్చే వారికి నిర్దిష్ట గ‌డువుతో కూడిన సింగిల్ విండో క్లియ‌రెన్స్ ఇస్తామంటూ నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్దూ తెలిపారు. 

Also Read : Amullu Arjun: ఇక తన పేరు 'అముల్లు అర్జున్' అంటున్న అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

కాగా టెస్లా కంపెనీ రిజిస్ట్రేషన్‌ మాత్రం కర్ణాటకలో (Karnataka) జరిగింది. 2017లోనే టెస్లా కర్ణాటక నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. కానీ ఆ తర్వాత టెస్లా నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ప్రస్తుతం పలు రాష్ట్రాల ఆహ్వానాలు, ప్రోత్సాహకాలు నచ్చి ఎల‌న్‌ మ‌స్క్‌ (Elon Musk) టెస్లా కంపెనీని భారత్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణకు (Telangana) పోటీగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు దిగడంతో టెస్లాను దక్కించుకోవడంలో గెలుపు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

Also Read : India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. త్వరలోనే అధికారిక ప్రకటన!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x