UPI linking with Credit Card: త్వరలో క్రెడిట్ కార్డుతో యూపీఐ అనుసంధానం, కలిగే ప్రయోజనాలివే

UPI linking with Credit Card: ఆర్బీఐ కొత్త మోనిటరింగ్ పాలసీ ప్రకటించింది. మరోవైపు క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. మీ క్రెడిట్ కార్డు..యూపీఐతో అనుసంధానమైతే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2022, 04:29 PM IST
UPI linking with Credit Card: త్వరలో క్రెడిట్ కార్డుతో యూపీఐ అనుసంధానం, కలిగే ప్రయోజనాలివే

UPI linking with Credit Card: ఆర్బీఐ కొత్త మోనిటరింగ్ పాలసీ ప్రకటించింది. మరోవైపు క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. మీ క్రెడిట్ కార్డు..యూపీఐతో అనుసంధానమైతే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

ఆర్బీఐ ఇవాళ అంటే బుధవారం నాడు కొత్త మోనిటరింగ్ పాలసీ ప్రకటించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఫలితంగా హోమ్ లోన్స్ ఈఎంఐ మరింతగా పెరగనుంది. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన మరో ప్రతిపాదన కాస్త ఉపశమనం కల్గించేదిగా ఉంది. క్రెడిట్ కార్డును యూపీఐ పేమెంట్స్‌తో అనుసంధానం చేసేదే ఆ ప్రతిపాదన. క్రెడిట్ కార్డును యూపీఏ చెల్లింపుల విధానంతో అనుసంధానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

భవిష్యత్తులో డెబిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ జరిగినట్టే క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ విదానంత అనుసంధానం చేసి సేవలందించే ప్రక్రియ ప్రారంభం కానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అంటే మీ క్రెడిట్ కార్డును యూపీఐ పేమెంట్స్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. 

అయితే తొలుత రూపే క్రెడిట్ కార్డుని యూపీఐతో అనుసంధానం చేస్తారని ఆర్బీఐ తెలిపింది. ఆ కస్టమర్లకు అదనంగా ఓ ప్రయోజనం కూడా లభించనుంది. డిజిటల్ పేమెంట్స్ పరిమితి పెరుగుుతంది. 26 కోట్ల యూపీఐ యూజర్లు 5 కోట్ల వ్యాపారులతో యూపీఐ విధానం దేశంలో అతిపెద్ద వేదికగా మారిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఒక్క మే , 2022లోనే 10.4 లక్షల కోట్ల రూపాయలు 594 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. 

క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం ద్వారా కలిగే ప్రయోజనాలు

- పేమెంట్ కోసం మరో ప్రత్యామ్నాయం లభిస్తుంది. 
- ఇప్పటి వరకూ మీరు మీ ఎక్కౌంట్‌లో ఉన్న డబ్బుల్నే యూపీఐ పేమెంట్ ద్వారా పంపించగలరు. క్రెడిట్ కార్డు అనుసంధానిస్తే..క్రెడిట్ కార్డు లిమిట్ యూపీఐ పేమెంట్ కోసం ఉపయోగపడుతుంది.
- ఈ సేవలు అందుబాటులో వస్తే..క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన తరవాత మీకు క్రెడిట్ కార్డులో 45-51 రోజుల సమయం లభిస్తుంది. ఇది యూపీఐ పేమెంట్‌లో కూడా వర్తిస్తుంది. 
- క్రెడిట్ కార్డు యూపీఐతో అనుసంధానించడం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ మరింత విస్తృతమౌతాయి
- క్రెడిట్ కార్డు యూపీఐతో జోడించే ప్రక్రియ రూపే కార్డుతో ప్రారంభం కానుంది. దీంతో దేశంలో పేమెంట్ నెట్‌వర్క్ మరింతగా వృద్ధి సాధిస్తుంది. 
- రూపే క్రెడిట్ కార్డు యూపీఐ నెట్‌వర్క్‌తో అనుసంధానం వల్ల ఇతర రంగాల్లో కూడా యూపీఐ చెల్లింపులు పెరుగుతాయి.

Also read: Amazon Monsoon Carnival Sale: శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ..అమెజాన్‌లో కేవలం 10 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News