Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది

Indian Economy: భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి కీలకమైన, ఆసక్తి కల్గించే వార్త ఇది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2021, 12:45 PM IST
  • భారత ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, ఇక్రా నివేదిక ఏం చెబుతోంది
  • భారత ఆర్దిక వ్యవస్థ మెరుగుపడే సంకేతాలున్నాయంటున్న ఇక్రా నివేదిక
  • భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటును 8.5 నుంచి 9 శాతంగా అంచనా వేస్తున్న ఇక్రా
Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది

Indian Economy: భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి కీలకమైన, ఆసక్తి కల్గించే వార్త ఇది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం.

భారత ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల(India at 5 Trillion Dollars Economy) శక్తిగా తీర్చిదిద్దాలనేది ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)ఆలోచన. అయితే గత ఏడాదిన్నరగా కరోనా సంక్షోభం కారణంగా, ఇతర పరిస్థితులతో ప్రతికూల ప్రభావం ఏర్పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుటోంది. ఈ క్రమంలో భారత ఆర్దిక వ్యవస్థ ఎలా ఉందనే విషయంపై ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.

భారత ఆర్ధిక వ్యవస్థ (Indian Economy)కొద్దికొద్దిగా మెరుగుపడుతున్న సంకేతాలు కన్పిస్తున్నాయని ఇక్రా నివేదిక తెలిపింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను 8.5 శాతం నుంచి 9 శాతానికి పెంచింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విస్తృతి, ఖరీఫ్ పంట బాగుంటుందనే అంచనాలు, ప్రభుత్వ వ్యయాల వేగవంతం వంటి అంశాలు వృద్ధి అంచనా పెరగడానికి కారణమని ఇక్రా నివేదిక(ICRA Report) పేర్కొంది. అయితే ఆర్బీఐ (RBI)అంచనా ఇక్రా వివేదిక అంచనా కంటే ఎక్కువే ఉంది. ఆర్బీఐ వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేసింది. 

ఈ ఆర్ధిక సంవత్సరం రెండవ ఆరు నెలల కాలంలో అంటే 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చ్ వరకూ ఆర్ధిక వ్యవస్థలో మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని ఇక్రా అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం పెరుగుతుండటం ఎకానమీ గ్రోత్‌పై విశ్వాసాన్ని కల్పిస్తోంది. కీలకమైన రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయరంగం నుంచి వినియోగపు డిమాండ్ పటిష్టంగా ఉంది. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్నించి 2,3 త్రైమాసికాల్లో వృద్ధి 3 శాతం ఉండే పరిస్థితి ఉంది. పారిశ్రామిక రంగం మాత్రం ఇంకా బలహీనంగానే ఉందని ఇక్రా నివేదిక వెల్లడించింది. సెమీ కండక్టర్ లభ్యం కాకపోవడం ఆటోరంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది పరోక్షంగా జీఎస్టీ ఈ వే బిల్లులపై ప్రభావం చూపవచ్చు. అటు భారీ వర్షాలు కూడా విద్యుత్ డిమాండ్ ను దెబ్బ తీస్తున్నాయని ఇక్రా చెబుతోంది. మైనింగ్, నిర్మాణరంగాలకు ఈ పరిస్థితి కచ్చితంగా ప్రతికూలంగానే ఉండనుంది. అయితే ఈ వృద్ధి అంచనాలన్నీ కరోనా థర్డ్‌వేవ్ (Corona Third wave)సవాళ్లకు లోబడి ఉండనున్నాయనేది గమనార్హం. 

Also read: Review on GST: జీఎస్టీపై మరోసారి సమీక్ష, ఆ రెండు కమిటీల నిర్ణయమే కీలకం, పెట్రోల్ పరిస్థితి ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News